Heroine Amani : ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ ఆమని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కుటుంబ కథా చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఈమె నటనకు ప్రేక్షకులతో ఈలలు వేయించుకుంది. అప్పట్లో ఈమె బిజీ హీరోయిన్. పెళ్లి తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఒక వైపు సినిమాలు మరోవైపు బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ మధ్యకాలంలో mca, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జిగా వ్యవహారిస్తూ, ఇక సీరియల్స్ కూడా నటిస్తూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది..
ఆమని ఇంటర్వ్యూ..
హీరోయిన్ ఆమని గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఒకవైపు ఫ్యామిలిని లీడ్ చేస్తూ, మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంది. గతంలో ఆమని సూసైడ్ చేసుకో బోతుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తల పై హీరోయిన్ ఆమని ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమని ఆ న్యూస్ గురించి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది తాను కాదని తన భర్త ఖాజామోయిద్దిన్ అని చెప్పారు. అతను ఒక తమిళ ప్రొడ్యూసర్ కాగా ఆమని ఆయన ప్రొడక్షన్ లో సినిమా చేసారు.. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ప్రేమగా మారింది. అలా ఇద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బాగానే సాగిన వీరి సంసారంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన నిర్మాణంలో కొన్ని సినిమాలు ప్లాప్ అవడం వల్ల ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయలేక డిప్రెషన్ లోకి వెళ్లి సుసైడ్ అటెంప్ట్ చేసారు కానీ నేను ఆ సమయంలో ఆయనతో హాస్పిటల్ లో ఉండటం వల్ల నేనే ఆత్మహత్యయత్నం చేసానని అనుకున్నారు అంటూ ఆమని తెలిపారు.
Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..
భర్తకు దూరమైనా ఆమని..
కొన్ని పరిస్థితుల వల్ల భార్య భర్తల వల్ల గొడవలు ఎక్కువ అయ్యాయని దాంతో అతనికి దూరమైందట. ప్రస్తుతం భర్త తో కలిసి ఉండటం లేదని పిల్లలతో కలిసి ఉంటున్నట్లు చెప్పిన ఆమని తన తల్లి ఇప్పటికి చూసుకుంటున్నట్లు చెప్పారు. పిల్లలు ఒకరు 3 వ తరగతి ఒకరు రెండో తరగతి చదువుతున్నారని చెన్నై లోనే ఉంటున్నట్లు చెప్పింది. ఇక ప్రస్తుతం ఈమె తన జీవితాన్ని తన పిల్లలతో గడుతుంది. ఒకవైపు సినిమాలు మరో ఒకవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తూ బాగానే సంపాదిస్తుంది. ఇటీవల బాపు అనే సినిమాలో నటించింది. బ్రహ్మజీ సరసర జోడీగా నటించింది. ఆ మూవీ అనుకున్న టాక్ ను అయితే సొంతం చేసుకోలేదు. కానీ ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నటిస్తుంది.