BigTV English

Geethu Royal: మహానటి సావిత్రిపై కీలక వ్యాఖ్యలు.. చేసిన తప్పుకు శిక్ష అనుభవించిందంటూ..?

Geethu Royal: మహానటి సావిత్రిపై కీలక వ్యాఖ్యలు.. చేసిన తప్పుకు శిక్ష అనుభవించిందంటూ..?

Geethu Royal: ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. లేడీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్(Bigg Boss) లోకి అడుగుపెట్టి, అక్కడ తన అద్భుతమైన నటనతో, ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 6లోకి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె, ఆట తీరుతో ప్రేక్షకులను అలరించింది. కానీ ఓవరాక్షన్ చేసి అతి త్వరగానే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లకు రివ్యూ చెప్పడంతో పాటు 7 సీజన్ బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫుల్ జోష్ లో ఉండే ఈమె అప్పుడప్పుడు చేసే కామెంట్లు వివాదానికి కూడా దారితీస్తున్నాయి. ముఖ్యంగా గతంలో కూడా పలు వివాదాలలో ఇరుక్కున్న గీతూ ఇప్పుడు దివంగత నటి మహానటి సావిత్రి (Mahanati Savitri) గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అటు నెటిజన్స్ మాత్రమే కాదు సినీ పరిశ్రమ కూడా ఈమె పై మండిపాటుకు గురవుతోందని సమాచారం. మరి అసలు గీతూ చేసిన కామెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.


Prakash Raj: పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ఏమైందంటే..?

చేసిన తప్పుకు ప్రతిఫలం తప్పదు..


తాజాగా సోషల్ మీడియాలో గీతూ రాయల్ ఒక వీడియో వదులుతూ.. ఆ వీడియోలో సావిత్రి గురించి, ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది. అందులో గీతూ మాట్లాడుతూ.. “ఇదివరకే ప్రేమలో ఉన్న వాళ్ళ జోలికి కానీ లేదా ఆల్రెడీ పెళ్లి అయిన వాళ్ళ జోలికి కానీ ఎవరూ అసలు వెళ్ళకూడదు. నాకు మహానటి(Mahanati ) సినిమా చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంది. సావిత్రమ్మ ఎంతో గొప్పది. కానీ జెమినీ గణేషన్ కి పెళ్లయింది, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా.. మళ్ళీ అతడినే ప్రేమించి, పెళ్లి చేసుకోవడం ఆమె జీవితంలో ఆమె చేసిన అతిపెద్ద తప్పు. ఆవిడ మాత్రం ఆయన్ని వేరే అమ్మాయితో చూస్తే తట్టుకోలేదు. కానీ ఆవిడ మాత్రం వేరే ఆమె భర్తను పెళ్లి చేసుకోవచ్చా..? కర్మ అనేది బూమరాంగ్ లాంటిది. ఆమె ఏదైతే చేసిందో.. తిరిగి మళ్ళీ ఆమెకే వచ్చి చేరింది. కర్మ నుండీ ఎవరూ తప్పించుకోలేరు. సావిత్రి తప్పు చేసింది. కాబట్టి మళ్లీ అదే తప్పు ఆమెను వెంటాడింది” అంటూ సావిత్రి గురించి, ఆమె లైఫ్ గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

గీతూ రాయల్ పై మిశ్రమ స్పందన..

ఇక ఇక్కడితో ఆగకుండా..” మీ లైఫ్ లో కూడా ఇలా జరగవచ్చు. ఒకరు మీకోసం వేరే వాళ్లను కాదనుకొని వస్తున్నారు అంటే రేపటి రోజున వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని కూడా వదిలేయరన్న గ్యారెంటీ ఏంటి? కాబట్టి జాగ్రత్తగా ఉండండి” అంటూ అందరికీ హితబోధ చేసింది. దీంతో కొంతమంది నెటిజన్స్ ఈమెపై మండిపడుతున్నారు. మహానటి సావిత్రి లాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని జడ్జ్ చేయడానికి నువ్వెవరు? ఆమె జీవితం ఆమె ఇష్టం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది గీతూ చెప్పిందాంట్లో తప్పేముంది. సావిత్రిని అందరూ పొగుడుతూ ఉండేవాళ్లే కానీ మహానటి మూవీ చూశాక తప్పు ఆవిడదే అనే అర్థమవుతుంది. చేతులారా తన జీవితాన్ని ఆమె నాశనం చేసుకుంది కదా.. అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మహానటి సావిత్రి జీవితంపై గీతూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

?utm_source=ig_web_copy_link

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×