Holi Special Train: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ పెరగడంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇబ్బందులు కలగకుండా సజావుగా ప్రయాణాలు కొనసాగించేలా చర్యలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా హోలీ సందర్భంగా 400 పైగా ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేసింది. ఇందులో ఓ వందే భారత్ రైలు కూడా ఉంది. ఈ రైలు న్యూఢిల్లీ నుంచి పాట్నావరకు రాకపోకలు కొనసాగిస్తోంది. ఈ నెల 20 వరకు ఈ రైలు తన సర్వీసులను అందించనుంది. అటు ఈస్ట్ కోస్ట్ రైల్వే సైతం హోలీ సందర్భంగా అదనపు రద్దీని తగ్గించడానికి విశాఖపట్నం-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది.
విశాఖ-బెంగళూరు ప్రత్యేక రైలు వివరాలు
⦿ విశాఖపట్నం – SMVT బెంగళూరు – విశాఖపట్నం హోలీ ప్రత్యేక రైలు
విశాఖపట్నం – SMVT బెంగళూరు – విశాఖపట్నం హోలీ ప్రత్యేక రైలు రెండు ట్రిప్పులు వేయనుంది. ఈ రైలు(నంబర్ 08549) మార్చి 16తో పాటు 23న మధ్యాహ్నం 3:30 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ స్టేషన్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (నంబర్ 08550) మార్చి 17, 24న మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి బయయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ స్పెషల్ రైలు ఏ స్టేషన్లలో ఆగుతుందంటే?
విశాఖపట్నం – SMVT బెంగళూరు – విశాఖపట్నం హోలీ ప్రత్యేక రైలు మార్గ మధ్యలో పలు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూరు, అరక్కోణం, కటపడి, జోలార్ పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో రెండు మార్గాల్లో హాల్టింగ్ తీసుకుంటుంది.
Read Also: దేశంలో అత్యంత పురాతనమైన రైళ్లు ఇవే.. ఎన్నేండ్ల క్రితం పట్టాలెక్కాయో తెలుసా?
ఇక ఈ ప్రత్యేక రైలు మొత్తం 20 కోచ్‌లను కలిగి ఉంటుంది. వాటిలో 4 AC త్రీ టైర్, 2 AC త్రీ టైర్ ఎకానమీ, 8 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్, 1 బ్రేక్, లగేజ్ కమ్ జనరేటర్ కార్, 1 సెకండ్ లగేజ్ – కమ్ – బ్రేక్ వ్యాన్ / డిసేబుల్డ్ కోచ్ ఉన్నాయి. ఈ రైలుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ప్రయాణీకులు భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్ చూడాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో మంజునాథ తెలిపారు. లేదంటే 139కి డయల్ చేయడం పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు. రెండు ట్రిప్పులు వేసే ఈ రైలుకు ముందస్తు బుకింగ్ చేసుకోవడంతో పాటు ఆయా స్టేషన్లలో టికెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందన్నారు. హోలీ రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ రైలును ప్రయాణీకులు ఉపయోగించుకోవాలని సూచించారు. రద్దీ వేళ్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంజునాథ వెల్లడించారు.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కావద్దు!
Read Also: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. ఎప్పుడు? ఎక్కడ అందుబాటులోకి వచ్చిందంటే?