BigTV English

Shiva Jyothi : నోరు జారిన బిగ్ బాస్ బ్యూటీ.. ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్..!

Shiva Jyothi : నోరు జారిన బిగ్ బాస్ బ్యూటీ.. ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్..!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలు బాగానే ఉంటారు. కానీ వారి అభిమానుల మధ్య గొడవే ఒక్కొక్కసారి తారాస్థాయికి చేరుతూ ఉంటుంది. ముఖ్యంగా మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అంటూ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో మాటల యుద్ధం చేస్తారు. అక్కడితో ఆగకుండా ఫ్యామిలీ లోని విషయాలను కూడా బయటకు తీస్తూ ఆగమాగం చేస్తుంటారు. అయితే హీరోలు మాత్రం అభిమానుల మధ్య ఎంత గొడవ ఉన్నా.. తమకేమీ పట్టనట్టు కొంతమంది ప్రవర్తిస్తే, మరి కొంతమంది ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అంటూ అభిమానులకు పిలుపునిస్తూ ఉంటారు. కానీ గత కొద్ది రోజులుగా ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్(NTR ) అభిమానుల మధ్య గొడవలు బాగా ముదిరిపోయాయి.


ప్రభాస్ పై శివజ్యోతి కామెంట్స్..

ఇకపోతే దేవర సినిమా విడుదలైన తర్వాత ప్రభాస్ అభిమానులు ఎన్టీఆర్ లుక్స్, ట్రైలర్, పోస్టర్ లను సోషల్ మీడియాలో షేర్ చేసి, నెగిటివ్ కామెంట్స్ తో వైరల్ చేస్తూ కామెంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ ను సినిమాలో చూపించిన తీరు పై మేకర్స్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అప్పుడు ఎన్టీఆర్ ని ప్రభాస్ అభిమానులు దారుణంగా వాడుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది ఎన్టీఆర్ అభిమానులకు.. సమయం కోసం ఎదురుచూసిన వీరికి సరిగ్గా శివ జ్యోతి రూపంలో ఒక వార్త అయితే దొరికిందని చెప్పాలి.


ప్రభాస్ ను దున్నపోతుతో పోల్చిన శివ జ్యోతి..

తాజాగా ఒక జాతరలో పాల్గొన్న బిగ్ బాస్ బ్యూటీ, ప్రముఖ యాంకర్ శివజ్యోతి జాతరలో ఉన్న దున్నపోతుని చూసి భలే దిట్టంగా ఉంది.బాహుబలి సినిమాలో ప్రభాస్ అన్న లెక్క అంటూ కామెంట్లు చేసింది. వాస్తవానికి ఇది దాదాపు మూడు సంవత్సరాల క్రితం జరిగిన విషయం. కానీ ఎన్టీఆర్ అభిమానులు ప్రభాస్ ను టార్గెట్ చేయడానికి ఏ అంశాలు లేకపోవడంతో ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇక అంతే ప్రభాస్ ని దున్నపోతుని చేసేసింది అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాన్ని పదే పదే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి శివజ్యోతి సరదాగా కామెంట్ చేసినా.. ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం దీనిని విమర్శగా తీసుకొని వైరల్ చేస్తున్నారు. మొత్తానికైతే ఎరక్కపోయి ఇరుక్కుపోయింది ఈ యాంకరమ్మ.

శివ జ్యోతి వ్యక్తిగత జీవితం..

ఇక శివ జ్యోతి విషయానికి వస్తే..తీన్మార్ వార్తలు చదువుతూ సావిత్రి పేరుతో భారీ పాపులారిటీ దక్కించుకుంది శివజ్యోతి. యాంకర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుని, ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో తీన్మార్ వార్తలు చదువుతూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకుని, బిత్తిరి సత్తితో చేసిన షోస్ బాగా పాపులారిటీ అందించాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని నాగంపేట గ్రామంలో యశోద, రాజ మల్లేష్ దంపతులకు జన్మించింది. ఈమె తల్లి బీడీ కార్మికురాలు కాగా తండ్రి ఆర్ఎంపీ డాక్టర్. ఏడవ తరగతి వరకు నాగంపేటలోనే చదువుకున్న ఈమె పదవ తరగతి రేంజర్ల పక్క గ్రామానికి నడుస్తూ వెళ్లేవారట. నిజామాబాదులో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. హైదరాబాద్ యశోదలో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ లో చేరింది మధ్యలోనే ఆపేసి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×