BigTV English

Bigg Boss 8 : బిగ్ బాస్ హౌస్ లో బాబుల పంచాయతీ… దారుణంగా కొట్టుకున్న హౌస్ మేట్స్

Bigg Boss 8 : బిగ్ బాస్ హౌస్ లో బాబుల పంచాయతీ… దారుణంగా కొట్టుకున్న హౌస్ మేట్స్

Bigg Boss 8 : బిగ్ బాస్ అంటేనే గొడవలు, వివాదాలు. ప్రతి సీజన్లో ఈ విషయం ప్రూవ్ అవుతూనే ఉంది. తెలుగులో అయితే ఈ షో అంటేనే అసలు నచ్చని వారు కొంతమంది అయితే, అందులో హౌస్ మేట్స్ మధ్య జరిగే గొడవ కోసమే చూసే వారు మరికొంత మంది. ఏదైతేనేం తెలుగులో సీజన్ 8 (Bigg Boss 8 Telugu) ఎండింగ్ కి వచ్చేసింది. మరో వారం రోజుల్లో విన్నర్ ఎవరు అనేది తేలిపోనుంది. అయితే తమిళ బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం గొడవల్లో మరో స్థాయికి చేరుకుంది. తాజాగా హౌస్ మేట్స్ మధ్య బాబుల పంచాయితీ రాగా, కొట్టుకునే దాకా వెళ్లారు.


బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 (Bigg Boss 8 Tamil) ప్రస్తుతం 9వ వారం నడుస్తోంది. అందులో భాగంగా ఏంజెల్స్ వర్సెస్ డిమాన్స్ అనే టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్. కానీ ఈ టాస్క్ ఆడడం పక్కన పెట్టేసి ఇంటిని తమ గొడవలతో యుద్ధభూమిగా మార్చేశారు కంటెస్టెంట్స్. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను రెండు భాగాలుగా విడగొట్టారు. అందులో ఒకటి ఏంజెల్స్ కాగా, మరొక టీం డిమాన్స్ టీం. ఏంజెల్స్ టీమ్ లో సత్య, అన్షిత, రంజిత్, విశాల్, పవిత్ర, అనంతి, రేయాన్, రణవ్, జెఫ్రీ ఉండగా… డిమాన్స్ టీమ్ లో జాక్వెలిన్, తారిక, దీపక్, అరుణ్, సౌందర్య, మంజరి, ముత్తుకుమారన్, సంచన ఉన్నారు.

డిమాన్స్ ఇంటి బయట గార్డెన్ ఏరియాలో, ఏంజిల్స్ ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. బయట ఉన్న డిమాన్స్ పాలను ఉపయోగించకుండా ఉండాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఇది హౌస్ లో తీవ్ర సంఘర్షణకు దారి తీసింది. డిమాన్స్ టీం కంటెస్టెంట్ మంజరి పాల ఆంక్షలపై కిచెన్ టీంతో గొడవ పడడంతో టాస్క్ గందరగోళంగా మారింది. అందులో భాగంగానే జాక్వెలిన్, సౌందర్యల మధ్య తీవ్ర వాదన జరిగింది. ముగ్గురూ కూడా తీవ్రమైన పదజాలాలను ఉపయోగించి ఒకరిపై ఒకరు విరుచుపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఆ హీట్ మూమెంట్ లో ఒక లేడి కంటెస్టెంట్ నోరు జారి ‘బాబు’ అంటూ కామెంట్ చేసింది. అంతే మరో కంటెస్టెంట్ ఆమెపై విరుచుకు పడుతూ నెట్టేసింది. అక్కడే ఉన్న మేల్ కంటెస్టెంట్స్ వారిద్దరినీ ఆపడానికి ట్రై చేశారు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మంచి చెడు మరిచి నిజంగానే దెయ్యాల్లా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు ప్రేక్షకులు. ఏదేమైనా భాషతో సంబంధం లేకుండా బిగ్ బాస్ అంటే చాలు అదే గొడవలు, రచ్చ, పంచాయతీలు నడుస్తున్నాయి. ఇక తమిళంలో అయితే ఇప్పుడు మరో స్థాయికి చేరింది. ఏకంగా కొట్టుకునే దాకా వెళ్లారు కంటెస్టెంట్స్. ఇక ఈ వారం ఎవిక్షన్ లిస్ట్‌లో మంజరి, అనంతి, రంజిత్, తారిక, పవిత్ర, సత్య, రణవ్, జాక్వెలిన్, సౌందర్య, ముత్తుకుమారన్ అనే పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×