BigTV English

YCP Supports Pushpa 2: మెగా ఫ్యాన్స్ లేకపోతే ఏంటి, మేము ఉన్నాం.. అల్లు అర్జున్‌కు వైసీపీ ఫాలోవర్స్ సపోర్ట్

YCP Supports Pushpa 2: మెగా ఫ్యాన్స్ లేకపోతే ఏంటి, మేము ఉన్నాం.. అల్లు అర్జున్‌కు వైసీపీ ఫాలోవర్స్ సపోర్ట్

YCP Supports Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి ఎంత సపోర్ట్ లభిస్తుందో.. అదే నెగిటివిటీ కూడా వస్తోంది. ఆ నెగిటివిటీ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ మొత్తం అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేయకూడదని ఫిక్స్ అయిపోయారు. అందుకే చాలామంది ‘పుష్ప 2’ విషయంలో సైలెంట్‌గా ఉన్నా మరికొందరు మాత్రం ఈ సినిమాపై నెగిటివిటీ వచ్చేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం అల్లు అర్జున్‌కు, ‘పుష్ప 2’కు మెగా ఫ్యాన్స్ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు. అదే సమయంలో మేము ఉన్నామంటూ వైసీపీ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌కు అండగా ముందుకొచ్చారు.


ఇప్పటికీ కోల్డ్ వార్

మామూలుగా సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులను ఓపెన్‌గా సపోర్ట్ చేయడానికి చాలా ఆలోచిస్తారు. దానివల్ల తమ కెరీర్ ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటారు. కానీ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి మెగా ఫ్యామిలీ అంతా తనకు సపోర్ట్‌గా ముందుకొచ్చింది. అలా మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంటే.. అల్లు అర్జున్ మాత్రం రూటు మార్చాడు. నంద్యాలలో వైసీపీ కార్యకర్తకు సపోర్ట్‌గా ప్రచారం చేపట్టాడు. దానివల్ల మెగా ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు.. ఫ్యామిలీకి కూడా కోపం వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అందుకే ‘పుష్ప 2’కు వారి నుండి సపోర్ట్ కరువయ్యింది.


Also Read: ఫైనల్‌గా మెగా సపోర్ట్ వచ్చేసింది… మరి బన్నీ రిప్లై ఇస్తాడా..?

వైసీపీ ఫాలోవర్స్ భరోసా

మామూలుగా ఏ మెగా హీరో సినిమా రిలీజ్ అయినా కూడా ఇతర మెగా హీరోలంతా కలిసి వారికి సపోర్ట్ చేస్తారు. ప్రమోషన్స్‌లో భాగమవుతారు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు కూడా హాజరవుతారు. కానీ ‘పుష్ప 2’ (Pushpa 2) విషయంలో అలా జరగడం లేదు. అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రమే ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడు. ప్రమోషన్స్‌కు దర్శకుడు సుకుమార్ (Sukumar) కూడా దూరంగానే ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో బన్నీకి సపోర్ట్‌గా మేము ఉన్నామంటూ వైసీసీ ఫాలోవర్స్ ముందుకొచ్చారు. ఏపీలోని పలు థియేటర్లలో ‘పుష్ప 2’ పోస్టర్‌తో జగన్ ఫోటో కలిపి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే వైసీపీ నాయకులు, జగన్ అభిమానులు అల్లు అర్జున్‌కు అండగా నిలుస్తున్నారని అర్థమవుతోంది.

ఇప్పుడు మీకోసం మేము

‘మా కోసం నువ్వు వచ్చావు. మీకోసం మేము వస్తాం’ అంటూ అల్లు అర్జున్, జగన్ ఫోటోలు పక్కపక్కనే ఉన్న ఫ్లెక్సీలో ఏపీలో పలు థియేటర్ల వద్ద కనిపిస్తున్నాయి. ఇవి మెగా ఫ్యాన్స్‌ను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. అప్పుడు జగన్‌కు, తన పార్టీకి సపోర్ట్ చేయడం వల్లే అల్లు అర్జున్.. మెగా ట్యాగ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు వైసీపీ ఫాలోవర్స్ చేస్తున్న పనికి మెగా ఫ్యాన్స్‌లో ఆగ్రహం మరింత పెరిగిపోతోంది. అయినా కూడా ఇలాంటి టైమ్‌లో కోపం కరెక్ట్ కాదనుకొని మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ‘పుష్ప 2’కు బెస్ట్ విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×