జూనియర్ సమంత (Junior Samantha).. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy). సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ముద్దుగుమ్మ సడన్గా గుర్తుపట్టలేనంతగా మారిపోయి, అందరిని ఆశ్చర్యపరిచింది. తన అంద చందాలతో అచ్చం సమంతా లాగే కనిపించి,జూనియర్ సమంత అనే పేరు కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే ఇన్ని రోజులు నెట్టింట గ్లామర్ ఫోటోలతో సంచలనం సృష్టించిన ఈ బ్యూటీ.. సడన్గా బామ్మ గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
బామ్మ గెటప్ లో..
ఎప్పుడూ సోషల్ మీడియాలో వరుస ఫోటోలతో యువతకు చెమటలు పట్టించే ఈమె.. ఇలా సడన్ గా బామ్మ గెటప్ లో కనిపించేసరికి నిజంగా ఇక్కడ వున్నది అషునేనా అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈమెకు ఏమైంది..? ఎందుకు ఇలా మారిపోయింది..? అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు అషు రెడ్డి ఇలాంటి గెటప్ లో కూడా చాలా అందంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
టిక్ టాక్ ద్వారా పాపులారిటీ..
ఇక అషు విషయానికి వస్తే.. టిక్ టాక్ , ఇన్ స్టా రీల్స్ ద్వారా చాలా ఫేమస్ అందుకున్న ఈమె.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి అక్కడ తన ఆట తీరుతో అందచందాలతో భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తో ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అడపాదడక సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్న విని ఫోటో మీడియాలో మొత్తం వీడియోస్ మీరు చేస్తూ యువతకు దగ్గరవుతోంది.
2018లో తెలుగు తెరకు పరిచయం..
ఇక అషు రెడ్డి విషయానికి వస్తే.. 1995 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించిన ఈ చిన్నది , ఎక్కువగా తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేస్తోంది. 2018 లో వచ్చిన ‘ఛల్ మోహన్ రంగా’ సినిమాతో ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో మూడో కంటెస్టెంట్ గా , సోషల్ మీడియా సెలబ్రిటీగా హౌస్ లోకి అడుగుపెట్టింది. హౌస్ లో తన అంద చందాలతో ఆటతీరుతో అందరినీ మెప్పించిన ఈమె హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఫేవరెట్ బ్యూటీగా కూడా పేరు సొంతం చేసుకుంది.
కాంట్రవర్సీలో ఇరుక్కున్న అషు రెడ్డి..
మరోవైపు పాపులారిటీనే కాదు కాంట్రవర్సీలో కూడా ఇరుక్కుంది అషురెడ్డి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసింది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను మాట్లాడడమే కాకుండా అసభ్యకర కామెంట్లు కూడా వైరల్ అవ్వడంతో అప్పట్లో ఈమెను చాలామంది విమర్శించారు కూడా.. దీనికి తోడు డేంజరస్ సినిమా ప్రమోట్ చేసే సమయంలో కూడా అషు రెడ్డి వర్మ తో రెండవ సారి ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఆమె కాలివేళ్ళను వర్మ నోట్లో పెట్టుకోవడం కూడా అప్పుడు సంచలనంగా మారింది. ఏది ఏమైనా ఒకవైపు గ్లామర్ బ్యూటీగా మరొకవైపు కాంట్రవర్సీ లలో ఇరుక్కొని ఇప్పుడు సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతోంది ఈ ముద్దుగుమ్మ.