BigTV English

Matka Movie Review : ‘మట్కా’ మూవీ రివ్యూ

Matka Movie Review : ‘మట్కా’ మూవీ రివ్యూ

రివ్యూ : మట్కా మూవీ
నటీనటులు : వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరాఫతేహి, నవీన్ చంద్ర తదితరులు
దర్శకత్వం : కరుణ కుమార్
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
నిర్మాతలు : డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు : వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్


Matka Movie Rating : 1/5

Matka Movie Review and Rating : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ గత కొంతకాలంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. ‘గద్దల కొండ గణేష్’ మూవీ తర్వాత ‘గని’, ‘గాంధీవదారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలతో వరుసగా డిజాస్టర్ లను చవి చూశాడు. ఇలా హ్యాట్రిక్ డిజాస్టర్ లను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్.. కొంచెం గ్యాప్ తీసుకుని, ‘పలాస’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే మూవీని చేశాడు. మరి ఈ మూవీతోనైనా వరుణ్ తేజ్ హిట్ అందుకున్నాడా? నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


కథ :
బర్మా నుంచి శరణార్థి వాసు (వరుణ్ తేజ్), అతని తల్లి బతుకుదెరువు కోసం 1958లో విశాఖపట్నం వస్తారు. వాసు ఒక హత్య కేసులో జైలుకు వెళ్లి, ఆ తరువాత ఫైటర్‌గా మారతాడు. వాసు సాహసోపేత స్వభావం, ధైర్యం, ధనవంతుడు కావాలనే కోరిక అతన్ని శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా మారుస్తాయి. మట్కా అంటే ఏంటి ? వాసు మట్కా కింగ్ గా ఎలా మారతాడు? ఆ తర్వాత అతనికి ఏం జరుగుతుంది ? అతని జీవితంలోకి వచ్చినా సుజాత (మీనాక్షీ చౌదరి) తో ప్రేమాయణం సంగతులు ఏంటి? అనేది తెరపై చూడాల్సిన కథ.

విశ్లేషణ :
1958 నుంచి 1982 మధ్య సాగే ఒక గ్యాంగ్ స్టార్ కథని ‘మట్కా’ మూవీలో చూపించారు. మట్కా అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు రతన్ ఖత్రి. పాకిస్తాన్ నుంచి ముంబైకి వచ్చిన ఆయన మట్కా కింగ్ గా ఎదిగి, ఏకంగా ప్రభుత్వానికి అప్పులు తీరుస్తాను అని ఆఫర్ చేసే స్థాయికి ఎదిగాడు. కేంద్ర ప్రభుత్వానికి ‘మట్కా’ను లీగల్ చేస్తే భారత్ కు ఉన్న అప్పులని తీర్చేస్తానని అప్పట్లో ఖత్రి ఆఫర్ ఇచ్చాడట. ఈ గ్యాంగ్ స్టర్ కథని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్చిన డైరెక్టర్ కరుణ కుమార్.. విశాఖపట్నం బ్యాక్ గ్రౌండ్ లో రూపొందించారు. కానీ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనట్టుగా కనిపిస్తోంది.

ఎదుగూ బొదుగూ లేని జీవితం మీద ప్రస్టేషన్ తో ఒక వ్యక్తి తన మేధస్సును, ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి, ఎంతకైనా తెగించి నెక్స్ట్ లెవెల్ కి ఎదగడం అనేది ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాం మనం. కాకపోతే సదరు హీరో అలా ఎదగడానికి ఎన్నుకునే మార్గం, స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ ‘మట్కా’ కథను చాలా సాధారణ శైలిలో ఇదే స్టోరీ లైన్ తో తెరకెక్కించారు. జీరో నుంచి గ్యాంగ్స్టర్ గా మారడం వరకు వరుణ్ తేజ్ లుక్స్ పరంగా చేసిన వైవిద్య ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. కానీ సినిమాలో చాలా వరకు జరిగే సంఘటనలను ప్రేక్షకులు ముందే ఊహిస్తారు. మూవీ ఫస్ట్ హాఫ్ లో తెలిసిన సీన్స్ కనిపిస్తూ ఉండడం వల్ల సినిమాపై ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. ఇంటర్వెల్ వరకు సంవత్సరాలు మార్చే స్లైడ్ లు, వెంట వెంటనే వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తాయి.

ఇక హీరో గ్యాంగ్ స్టర్ గా ఎదిగే గ్రాఫ్ లో గ్రిప్పింగ్ లేదా ఇంట్రెస్టింగ్ గా ఏమీ అనిపించదు. ఎలాంటి డెప్త్ లేదా ఇంటెన్సిటీ లేని సన్నివేశాలతో సినిమా బోర్ గా ఫీల్ అయ్యేలా అనిపిస్తుంది. ‘మట్కా’ అనేది పాతకాలపు యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, పాతకాలపు ఆలోచనలు కూడా ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా వర్కర్ గా హీరోతో భాగస్వామి చేరడం, బిగ్ షాట్స్ అతనికి సపోర్ట్ చేయడం, వెన్నుపోటు పొడవడం, అలాగే హీరో భార్య అతని తప్పులతో విరక్తి చెందడం వంటి సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇక మొండి పట్టుదల గల వ్యక్తి ఏం చేయబోతున్నాడు అనే క్వశ్చన్ మార్క్ తో ద్వితీయార్థంలోకి వెళుతుంది స్టోరీ.

కానీ కథనంలో పెద్దగా ఏమీ మార్పు ఉండదు. సెకండ్ హాఫ్ లో సిబిఐ మట్కా జూదం ఎలా నిర్వహించబడుతోంది అనే విషయంపై దృష్టి పెట్టి, దాంట్లో ఉన్నవారిని ఎలా బయటకు తీసుకొస్తుంది అనేది కాస్తో కూస్తో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత సినిమా కమర్షియల్ టర్న్ తీసుకుంటుంది. ఇక ఇక్కడ కూడా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కిడ్నాప్ ఎపిసోడ్, ఆ తర్వాత ఊహించిన క్లైమాక్స్ నీరసం తెప్పిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లోని రెండు పాటలు ‘లే లే రాజా’, ‘తస్సాదియా’ పాటలు చూడటానికి బాగున్నాయి. ఓకే అన్పించే క్లైమాక్స్ ఫైట్ ‘మట్కా’… సినిమాలో కనీసం చెప్పుకోవడానికి థ్రిల్లింగ్ అంశాలు, హై మూమెంట్స్, ట్విస్టులు వంటివి లేనే లేవు. పైగా విలనిజం అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. నేపథ్య సంగీతం కూడా కనీసం ఆకట్టుకోలేదు.

ఓవరాల్ గా మట్కా అనేది డబ్బు కోసం ఆకలితో ఉన్న హీరోకు సంబంధించిన మరో కమర్షియల్ ఫార్ములా కథ. మొత్తానికి అన్ని అంశాల్లోనూ ‘మట్కా’ నిరాశపరిచింది. జీవి ప్రకాష్ కుమార్ నుంచి ఇలాంటి నేపథ్య సంగీతం అస్సలు ఊహించలేము. గత సినిమాలు అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలకు ఆయన సంగీతమే ప్లస్ పాయింట్ అయింది. కానీ ఈ సినిమాలో అది మైనస్ గా మారడం గమనార్హం. స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ, వింటేజ్ ప్రాపర్టీస్, వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి. అయితే లుక్స్ పరంగా చూసుకుంటే వరుణ్ తేజ్ ఏజ్డ్ లుక్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇది మైనస్ పాయింట్.

నిజానికి ఇలాంటి కథలు సౌత్ వాళ్ళకి కొత్త. అయినప్పటికీ ప్రజెంట్ చేసే విధానం బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. కానీ కరుణ కుమార్ ప్రేక్షకులను మెప్పించేలా సినిమాను తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడు.

వరుణ్ తేజ్ తన లుక్స్‌ కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు. కానీ గ్యాంగ్‌స్టర్‌గా ఆయన లుక్ అస్సలు సెట్ కాలేదు. ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాల్సిన చోట కూడా వరుణ్ తేజ్ యవ్వనంగా కనిపించాడు. మీనాక్షి చౌదరి మరో అనవసరమైన పాత్రలో కనిపించింది. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. నోరా ఫతేహి తెలుగులో స్పెషల్ సాంగ్ కాకుండా, మొదటిసారిగా ఒక పాత్రలో కనిపించింది. అయినప్పటికీ మీనాక్షీ కంటే నోరా రోల్ బెటర్. అలాగే నోరా ఫతేహి స్పెషల్ సాంగ్, నటన బాగున్నాయి. మిగతా నటీనటులు కిషోర్, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, రవి శంకర్ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్ :

వింటేజ్ లుక్స్
మట్కా ఆపరేటింగ్ స్టైల్

మైనస్ పాయింట్స్ :

పాత కథ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
స్టోరీ నరేషన్
థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం
సీన్స్ లో డెప్త్ లేకపోవడం

మొత్తంగా… వరుణ్ తేజ్‌కి మట్కా మాయ చేయలేకపోయింది.

Matka Movie Rating : 1/5

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×