Raghu Rama on Jagan: రుషికొండ ప్యాలెస్ గురించి అసెంబ్లీలో చిన్నపాటి చర్చ జరిగింది. నేతల మాటల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ అల్లరైనా, మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారన్నారు.
డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఆయనొక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైనట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ సందర్భంగా సభలో విశాఖ రుషికొండ ప్యాలెస్‌పై చిన్నపాటి చర్చ జరిగింది.
మాజీ సీఎం జగన్‌ని ఎమ్మెల్యేగా రఘురామరాజు తన పొగడ్తలతో ముంచెత్తారు. 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టి జగన్ అల్లరి పాలైనా, మంచి ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారంటూ తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన తన రాజకీయ సమాధిని కట్టుకున్నారని చెప్పుకొచ్చారు.
రుషికొండ ప్యాలెస్ విషయంలో మొదటి నుంచి జరిగిన ప్రతీ విషయాన్ని పూసగుచ్చి మరీ వివరించారు. అప్పటివరకు టూరిజం ప్రాజెక్టని చెప్పిన గత ప్రభుత్వం, తాను విశాఖ వస్తున్నానంటూ జగన్ చెప్పడం వెనుక అసలు మతలబుని బయటపెట్టారు.
ALSO READ: దమ్ముంటే అడుగు పెట్టు.. ఆపై మాట్లాడు.. ఇచ్చిపడేసిన షర్మిల
రఘురామరాజు మాటలను సభలో సభ్యులంతా ఒకటే నవ్వులు. వేల కోట్లు రకరకాల రూపంలో దుర్వినియోగం అయ్యాయని అన్నారు. ఆయన తన రాజకీయ సమాధి కట్టుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖ ఎమ్మెల్యేలు రుషికొండ ప్యాలెస్ గురించి తమదైన శైలిలో చెప్పుకొచ్చారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్యాలెస్ గురించి ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా సభ్యులకు వివరించారు. అక్కడ మనం ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదని, అంతా ఆటో వాషింగ్ అంటూ వ్యాఖ్యానించారాయన. అందులోని విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేన్నారు.
తానే 30 ఏళ్ళ సియం అని పిచ్చతో, జగన్ రెడ్డి ముచ్చటపడి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ లో మరిన్ని చిత్రాలు వెలుగులోకి. #APBudgetSession2024 #APAssembly #AndhraPradesh pic.twitter.com/uotRBZoOHf
— Telugu Desam Party (@JaiTDP) November 14, 2024