Priayanaka Jain: బుల్లితెర నటి ప్రియాంక జైన్, శివకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జంట సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇటీవల ఆహా లో డాన్స్ ఐకాన్2 షోలో కంటెస్టెంట్ గా వ్యవహరిస్తున్నారు .ఇక మాటీవీలోఈ జంట కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 లోవైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ప్రియాంక, వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్నబిగ్ టీవీ కిసక్ టాక్ షో ప్రోగ్రాంలో అతిథిగా విచ్చేశారు.అందులో భాగంగా ఆమె తన పెళ్లి గురించి అభిమానులకు ఓక్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు చూద్దాం..
నా లిప్స్ బాగున్నాయ్ అన్నాడు.. మా పెళ్లి అప్పుడే..
బిగ్ టీవీ గ్రాండ్ గా నిర్వహిస్తున్న కిసక్ టాక్స్ షో ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి విచ్చేసి, వారి వ్యక్తిగత విషయాలను వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ వర్ష హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తన వాక్చాతుర్యంతో, సెలబ్రిటీలతో చాకచక్యంగా మాట్లాడి విషయాలను రాబడుతూ హోస్ట్గా సక్సెస్ అయ్యారు వర్ష. ఇక తాజాగా ప్రియాంక జైన్ తో ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రోమోనో బిగ్ టీవీ రిలీజ్ చేసింది. అందులో ప్రియాంక జైన్ మాట్లాడుతూ.. నేను కిలాడీ గర్ల్ ని, ప్రస్తుతం నేను చేస్తున్న కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ టీమ్ అమ్మాయిలకె నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ఒక అబ్బాయి మన జీవితంలోకి రావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే శివకుమార్ లాంటి క్యారెక్టర్ లా ఉండాలి అని నా అభిప్రాయం. ఈ షోలో ఆమె శివకుమార్ కు ఫోన్ చేసి ఐ లవ్ యు అని ప్రపోజ్ చేశారు. క్యాండిలైట్ డిన్నర్ చేయాలని అప్పటినుంచో నాకు కోరిక, బ్లాక్ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. బ్లాక్ డ్రెస్ లో డిన్నర్ కి వెళ్లడం ఇంకా ఇష్టం. ఆరోజు శివ నా లిప్స్ బాగున్నాయి అని చెప్పాడు. అంతవరకే జరిగింది ఇంకేం జరగలేదు అని ప్రియాంక తెలిపింది.వర్ష తరువాత మేము ఏమి జరిగిందో ఉహించుకున్నాం అని అంటుంది. ఇక మీపెళ్లిఎప్పుడు అని వర్షా అడగ్గా.. తొందరలోనే జరుగుతుంది అయితే మామూలుగా ఉండదు. ఓ రేంజ్ లో ఉంటుంది అని ఆమె తెలిపింది. మేము చూస్తున్నాము ఈ ఇయర్ లోనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. అని ప్రియాంక తెలిపింది.
ఆ రోజు నాకే అసహ్యం వేసింది ..ప్రియాంక
ఇటీవల మీరు ఒక షోలో వేసిన డ్రెస్ పై ఎన్నో కామెంట్స్ వచ్చాయి. దీని గురించి మీరేమంటారు అని అడగ్గా.. అసలు నాకే అసహ్యం అనిపించింది ఈ కామెంట్స్ నేను ఎందుకు చూశానో అని, నేను షోలో డ్రెస్ వేసుకున్నాను, అదే డ్రెస్ వేసుకొని నేను మాల్ లో తిరగలేదు కదా. ఉమెన్ ఎలాంటి డ్రెస్ వేసుకున్న ఇలాంటి కామెంట్ చేయడం మానేయాలి. అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు బట్టి వారిని జడ్జ్ చేయడం మానేయాలి అని ఆమె తెలిపింది. ఇంతే కాక ఆమె వ్యక్తిగత విషయాలను ఈ షోలో పంచుకున్నారు. ఈ ప్రోమో చూసిన వారంతా ఫుల్ వీడియో కోసం ఎదురుచూస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.