Marsh Brothers : ఆస్ట్రేలియన్ క్రికెటర్లు అదుర్స్ అనిపిస్తున్నారు. ముఖ్యంగా కొందరూ క్రికెటర్లు బ్రదర్స్ ఏ దేశమైనా రెచ్చిపోతున్నారు. ఇండియా పాండ్యా బ్రదర్స్.. ఇంగ్లండ్ లో కర్రన్ బ్రదర్స్.. ఇక ఆస్ట్రేలియాలో మార్ష్ బ్రదర్స్ క్రికెట్ లో అద్భుతంగా ఆడుతున్నారు. వాస్తవానికి మార్ష్ బ్రదర్స్ లో షాన్ మార్ష్ రిటైర్డ్ అయినప్పటికీ ఇప్పుడు ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. షాన్ మార్ష్ ఆస్ట్రేలియా క్రికెటర్. అతనికి ఐపీఎల్ ఆడినటువంటి అనుభవం ఉంది. ఐపీఎల్ 2008లో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు తరపున ఆడాడు. ఇక ఆ సీజన్ లో అత్యధిక పరుగులు చేసి ఆరేంజ్ క్యాప్ ని కూడా గెలుచుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ ని గెలుచుకున్న మొదటి ఆటగాడు మార్ష్ కావడం విశేషం.
Also Read : Rashid Khan : రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన మార్ష్.. గుజరాత్ టీం నుంచి ఔట్
తాజాగా మిచెల్ మార్స్ ఐపీఎల్ లో సెంచరీ సాధించాడు. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన లీగ్ దశ మ్యాచ్ లో 64 బంతుల్లో 117 పరుగులు చేశాడు ఓపెనర్ మిచెల్ మార్ష్. అందులో 8 సిక్సులు, 10 ఫోర్లు ఉండటం విశేషం. మార్ష్ బ్రదర్స్ మాత్రం ఐపీఎల్ లో రెచ్చిపోయారు. గతంలో షాన్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే.. ప్రస్తుతం మిచెల్ మార్ష్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ సీజన్ లో మిచెల్ మార్ష్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. మార్ష్ బ్రదర్స్ తన ప్రభావం ఏంటి చూపిస్తున్నారు. ముఖ్యంగా క్రికెటర్లలో ఏ దేశానికి చెందిన బ్రదర్స్ అయినా బ్యాటింగ్ లో మాత్రం తమ సత్తా చాటుతున్నారు. ఇండియా బ్రదర్స్ మాత్రం ఆలౌరౌండర్లనే చెప్పాలి. ప్రస్తుతం షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ బ్రదర్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరో వైపు లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించిన తరువాత లక్నో బ్యాటర్లు బ్యాటింగ్ లో ప్రదర్శన చూపించడం గమనార్హం. తాజాగా గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 235 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన రెండు సిక్సులు బాదాడు. చివరి ఓవర్ మొదటి బంతికే సిక్స్ బాదాడు పంత్. ఇక మరో ఓపెనర్ మాక్రమ్ 24 బంతుల్లో 36 పరుగులు చేయగా.. నికోలస్ పూరన్ 27 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ 6 బంతుల్లో 16 పరుగులు చేశాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్ల కి 235 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు ఇవాళ అంతగా బౌలింగ్ చేయలేదు. సాయి కిషోర్ బౌలింగ్ లో మార్క్రమ్, అర్షద్ ఖాన్ బౌలింగ్ లో మిచెల్ మార్ష్ మినహా మిగతా బౌలర్లు అంతా వికెట్లు తీయడం విఫలం చెందారు. దీంతో లక్నో బ్యాటర్లు రెచ్చిపోయి భారీ స్కోర్ చేశారు.
Shaun Marsh would be proud of his brother Mitchell. 👏 pic.twitter.com/xBDyWzoupe
— Dinda Academy (@academy_dinda) May 22, 2025