BigTV English

Liger : బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ‘లైగర్’ ఫైనాన్సియర్, డిస్ట్రిబ్యూటర్‌పై పూరి పోలీస్ కంప్లైంట్

Liger : బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ‘లైగర్’ ఫైనాన్సియర్, డిస్ట్రిబ్యూటర్‌పై పూరి పోలీస్ కంప్లైంట్

Liger : విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ డిజాస్టర్ అయ్యింది. పెట్టిన పెట్టుబడి రాకపోవటం, నష్టాల బారిన పడటంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పూరిని కలిసి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన ఏదో ఇస్తానని అన్నాడు. నెల రోజుల సమయం కూడా అడిగాడు. అయితే ఈలోపు పూరి జగన్నాథ్ ఇంటి ముందు అక్టోబర్ 27న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలిసిన పూరి వారిపై తన పరువు తీస్తే ఒక్క పైసా కూడా ఇవ్వనంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే.


తాజాగా లైగర్ వివాదం మరో మలుపు తీసుకుంది. ఫైనాన్సియర్ శోభన్ బాబు, డిస్ట్రిబ్యూటర్స్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు పూరి కంప్లైంట్ ఇచ్చాడు. పూరి ఇలా చేస్తాడని వారు అస్సలు ఊహించలేదు. దీంతో శోభన్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పూరిపై గుర్రుగా ఉన్నారు. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులను తీసుకుంటుందో చూడాలిక.

పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ ఊహించని రీతిలో పరాజయాన్ని చవి చూసింది. అప్పటి నుంచి సెటిల్‌మెంట్ వివాదం నివురు గప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది. పూరి కూడా మీడియాకు దూరంగా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వ్యవహారం మీడియాకెక్కింది. ఇప్పుడు మరి ఫైనాన్సియర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×