Big Stories

Miss Srilanka : ఘర్షణకు దారితీసిన “మిస్ శ్రీలంక న్యూయార్క్” పోటీలు

Miss Srilanka : అమెరికాలోని న్యూయార్క్‌ సమీపంలో ఉన్న స్టేటన్‌ ఐలాండ్‌లో ఇటీవల జరిగిన మిస్‌ శ్రీలంక పోటీలు కొట్లాట జరిగింది. పోటీలు ముగిసిన తర్వాత రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఆలస్యంగా వచ్చి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వివాదానికి కారణమేంటో తెలియదుకానీ.. మహిళలు, పురుషులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకను ఆదుకోవడానికి ఈ ఈవెంట్ నిర్వహించారు. కానీ, ఇది ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. ఈ ఘర్షణతో శ్రీలంక ఇమేజ్‌ డ్యామేజ్ అయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

మిస్ శ్రీలంక న్యూయార్క్ పోటీలను న్యూయార్క్‌లో కాకుండా శ్రీలంకలో ముందు నిర్వహించాలని అక్కడి నిర్వాహకులు అనుకున్నారు. అయితే ఈ పోటీ అమెరికాలో సెటిల్ అయిన శ్రీలంకీయులకు మాత్రమే నిర్వహించబడింది. ఘర్షణ ముఖ్యంగా ఈ అంశంపైనే జరిగినట్లు తెలస్తోంది. పోటీలో పాల్గొన్న 14 మంది కంటెస్టంట్లు ఎవరూ కూడా ఈ ఘర్షణలో పాలుపంచుకోలేదని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. తాజాగా జరిగిన ఈ పోటీలో “ఏంజెలియా గుణశేఖర” “మిస్ శ్రీలంక న్యూయార్క్” టైటిల్ ను సొంతం చేసుకుంది. శ్రీలంకలోని క్యాన్సర్ ఆసుపత్రికి నిధుల సమీకరించడానికి మిస్ శ్రీలంక న్యూయార్క్ పోటీలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. శ్రీలంకలో ఈ పోటీలను నిర్వహించినా నిధుల వచ్చే పరిస్థితి అంతగా లేదు. తాజాగా జరిగిన ఘర్షనతో శ్రీలంకీయులు కూడా మండిపడుతున్నారు. శ్రీలంక పరువును అమెరికాలో తీస్తున్నారని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News