Big Stories

Poonam Pandey – Cervical cancer: పూనమ్ పాండేకు సర్త్వెకల్ క్యాన్సర్ ఎలా సోకింది..? దీని లక్షణాలు ఏంటి?

Poonam Pandey – Cervical cancer: క్యాన్సర్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో ప్రాణల మీదకు తెచ్చుకుంటున్నారు. సరైన సమయంలో వీటిని గుర్తించలేకపోవడం వల్ల ఎన్నో జీవితాలు ఛిన్నా భిన్నం అవుతున్నాయి. ఈ క్యాన్సర్ల బారిన పడి ఎంతో మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

అందులో సర్త్వేకల్ (గర్భాశయ) క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధికి టీకాలు, స్క్రీనింగ్ టెస్ట్‌లు వంటివి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ వీటిపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఈ సర్త్వెకల్ క్యాన్సర్‌తో ప్రముఖ నటి అతి చిన్న వయసులోనే ప్రాణాలు విడిచింది.

- Advertisement -

బాలీవుడ్ నటి పూనమ్ పాండే (32) తాజాగా సర్త్వెకల్ (గర్భాశయ) క్యాన్సర్‌‌తో తుదిశ్వాస విడిచింది. ఆమె మృతితో ఈ క్యాన్సర్ గురించి ఇంటర్‌నెట్‌లో అందరూ తెగ వెతికేస్తున్నారు. దీని లక్షణాలు ఏంటి?.. ఈ క్యాన్సర్‌కు ఏమైనా చికిత్స ఉందా..? అంటూ సెర్చ్ చేసేస్తున్నారు. ఇప్పుుడు మనం ఈ క్యాన్సర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

సర్త్వెకల్ (గర్భాశయ) క్యాన్సర్:

సర్త్వెకల్ క్యాన్సర్ అనేది.. మహిళల్లో ఎక్కువగా సోకే క్యాన్సర్లలో నాలుగవది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ కారణంగా నమోదైన కేసుల్లో నాల్గవ వంతు, మరణాల్లో మూడో వంతు మనదేశం నుంచే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2020లో 604,127 గర్భాశయ క్యాన్సర్ కొత్త కేసులు నమోదు కాగా.. 341,831 మరణాలు సంభవించాయి. ఈ గర్భాశయ క్యాన్సర్‌ల మరణాలు అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా సంభవిస్తున్నాయి.

గర్భాశయ ముఖద్వారం నుంచి ఈ క్యాన్సర్ వస్తుంది. ఇది ముఖ్యంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ (HPV) కారణంగా సోకుతుంది. ఇది సోకిన తర్వాత ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్యాన్సర్‌గా అభివృద్ది చెందడానికి దాదాపు 15 నుంచి 20 ఏళ్లు పడుతుంది. అదే రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే మహిళల్లో 5 నుంచి 10 ఏళ్లు పడుతుంది.

కారణాలు:

ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు వాడటం, చిన్న వయస్సులోనే లైంగిక చర్య ప్రారంభించడం, ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, అతిగా ధూమపానం చేయడం వంటి తదితర కారణాలతో ఇది సంక్రమించే అవకాశముంది.

లక్షణాలు:

ఈ క్యాన్సర్ సోకిన మహిళల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందులో

  • ఈ క్యాన్సర్‌ బారిన పడిన మహిళల నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది.
  • దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జి.
  • లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు లేదా ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి, మంటగా అనిపిస్తుంది.
  • లైంగిక సంపర్కం సమయంలో లేదా మెనోపాజ్‌ దశలోనూ హెవీ బ్లీడింగ్‌ అవుతుంది.
  • ఈ క్యాన్సర్ ముదిరన తర్వాత పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, విరేచనాలు, నీరసం, కాళ్ల వాపు వంటి సమస్యలున్నా గర్భాశయ క్యాన్సర్‌గా అనుమానించాలి.

టెస్ట్‌లు:

ఇలాంటి లక్షణాలు కనిపించగానే అశ్రద్ద చేయకూడదు. వెంటనే సంబంధిత వైద్యున్ని సంప్రదించాలి. ఆపై దాన్ని నిర్ధారించుకోవడానికి టెస్ట్‌లు చేసుకోవాలి. దీనికి ప్రధానమైన టెస్టు ‘పాప్‌స్మియర్’. ఒక పరికరం ద్వారా గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీంతోపాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా ఈ గర్భాశయ క్యాన్సర్‌ని నిర్ధరించుకోవచ్చు.

చికిత్స:

ఈ క్యాన్సర్‌ సోకిందని నిర్థారణ అయితే దాని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స, రేడియేషన్‌ థెరపీ, కీమోథెరపీ, ఇమ్యునో థెరపీ వంటి చికిత్సలు చేస్తారు.

వ్యాక్సినేషన్:

అయితే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో 9 నుంచి 26 ఏళ్లలోపు వారికి ఓ టీకా అందుబాటులో ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News