Big Stories

Gaddar Awards – Mohan Babu reaction: ‘గద్దర్‌ అవార్డు’లపై సినీ ఇండస్ట్రీ మౌనం.. మోహన్‌ బాబు రియాక్షన్ ఇదే..?

Gaddar Awards – Mohan Babu reaction: నంది అవార్డులను ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ కళాకారులకు ఇస్తారు. అయితే వీటిని గత పదేళ్లుగా రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. దీనిపై చిరంజీవి, మోహన్ బాబు వంటి నటులు ఎన్నిసార్లు గుర్తు చేసిన ఫలితం లేకుండా పోయింది. అయితే తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గద్దర్ జయంతి వేడుకలో ఈ నంది అవార్డుల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.

- Advertisement -

సినీ పరిశ్రమకు నంది అవార్డుల పేరుతో ఇచ్చే పురస్కారాలను ఇకనుంచి‘గద్దరన్న అవార్డులు’ పేరుతో ఇస్తామని ప్రకటించారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. కానీ, సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఒక్క స్పందన కూడా రాలేదు. తాజాగా ఈ గద్దర్ అవార్డులపై ఇండస్ట్రీ నుంచి తొలి స్పందన వచ్చింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు తాజాగా స్పందించారు.

- Advertisement -

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు ట్వీట్ చేశారు. గద్దర్ పేరిట అవార్డులను నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నానని అన్నారు. సాంస్కృతిక గుర్తింపు పట్ల వారి నిబద్ధతకు నిదర్శనం అని తెలిపారు.

తన సోదరుడు గద్దర్ విషయంలో మరోసారి గర్విస్తున్నానని పేర్కొన్నారు. గద్దర్, ఆయన ఆత్మను కదిలించే పాటలు సమాజ పరివర్తనకు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి అని తెలిపారు. నిజంగా గద్దర్ పేరిట అవార్డులు.. అతని ప్రభావవంతమైన ప్రయత్నాలు, త్యాగాలను గౌరవించాయని అన్నారు. వ్యక్తిగతంగా ఇది తనకు ఎంతో గర్వకారణం అని ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చారు.

సినీ పరిశ్రమ మౌనం:

నంది పురస్కారాలను ఇకనుంచి గద్దర అవార్డులు పేరిట ఇస్తామని సీఎం రేవంత్ చెప్పడంతో సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరికి మాత్రం ఈ పేరు మార్పు నచ్చలేదని తెలుస్తోంది. ఈ కారణం చేతనే సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదని గుస గుసలు వినిపిస్తున్నాయి.

గద్దర్ గొప్ప వ్యక్తే అయినా.. ఆయనకు సినీ ఇండస్ట్రీకి పెద్దగా అనుబంధం లేదని అనుకుంటున్నారు. కాగా ‘గద్దర్ అవార్డులు’ పేరిట కవులు, కళాకారులకు ఈ పురస్కారం ఇస్తే బాగుంటుంది.. కానీ, సినీ పరిశ్రమకు సంబంధించిన అవార్డులకు ఇతరపేరు పరిశీలించాలని చెబుతున్నట్లు టాక్. గద్దరన్న మీద గౌరవంతో గొప్ప నిర్ణయమే తీసుకున్నా.. ఆ నిర్ణయం సరికాదని చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News