BigTV English

Priyanka Chopra: 3 లగ్జరీ అపార్ట్మెంట్స్ ను అమ్మేసిన SSMB 29 బ్యూటీ.. ఏమైందంటే..?

Priyanka Chopra: 3 లగ్జరీ అపార్ట్మెంట్స్ ను అమ్మేసిన SSMB 29 బ్యూటీ.. ఏమైందంటే..?

Priyanka Chopra:ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో హాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ తన నటనతో హాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించి, గ్లోబల్ స్టార్ గా భారీ క్రేజ్ దక్కించుకుంది. ఇకపోతే హాలీవుడ్ ఐకాన్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా.. ఒక్కో సినిమాకు రూ.45 కోట్ల మేరా రెమ్యూనరేషన్ తీసుకుంటూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం ఈమె తన భర్త ప్రముఖ సింగర్ నిక్ జోనాస్ తో కలిసి అమెరికాలో నివసిస్తున్న విషయం తెలిసిందే.


మూడు లగ్జరీ అపార్ట్మెంట్స్ ను అమ్మేసిన ప్రియాంక చోప్రా..

హాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే ఇప్పుడు ఇండియన్ సినిమాలలో కూడా నటించడానికి ముంబైలో అడుగు పెట్టింది. అందులో భాగంగానే దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Maheshbabu) హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 (SSMB 29) సినిమా ద్వారా ఇప్పుడు ఇండియన్ చిత్రాలలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా కొన్నాళ్లు హైదరాబాదులో బస చేసిన ఈమె.. ఇప్పుడు ముంబైకి చేరుకుంది. ఇక ఒకవైపు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే.. మరొకవైపు ఈమె ముంబై ఆస్తుల అమ్మకం గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబైలోని అందేరీ వెస్ట్ లో ఉన్న 3 హై అండ్ అపార్ట్మెంట్లను మొత్తం రూ.16.17 కోట్లకు సేల్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.


అపార్ట్మెంట్స్ వివరాలు ఇవే..

ముఖ్యంగా లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్ లో ఉన్న భారీ భవంతిలో 18వ అంతస్తులోని రెండు ఫ్లాట్లు, 19వ అంతస్తులో ఒక ఫ్లాట్ ని కలిపి విక్రయించారని సమాచారం. 18వ అంతస్తులోని 1,075 చదరపు అడుగుల అపార్ట్మెంట్ ను రూ.3.45 కోట్లకు అమ్మిన ఈమె, ఒక పార్కింగ్ స్థలంతో సహా ఈ అపార్ట్మెంట్ కోసం రూ.17.26 లక్షల స్టాంపు డ్యూటీ కూడా చెల్లించారు. అలాగే అదే అంతస్తులో ఉన్న మరో 885 చదరపు అడుగుల ఫ్లాట్ ను రూ. 2.85 కోట్లకు అమ్మగా.. రూ.14.25 లక్షల స్టాంపు డ్యూటీని చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక మూడవ అపార్ట్మెంట్ ధర సుమారు రూ.9 కోట్లు ఉండగా.. దీనికి కూడా భారీ ధరలోనే స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం. ఇక మొత్తంగా ఈ మూడు అపార్ట్మెంట్లు కలిపి రూ.16.17 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. ఇకపోతే అమెరికాలోనే తన భర్తతో ఉంటూ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఈమె సడన్గా ముంబైలో ఉన్న అపార్ట్మెంట్స్ అమ్మడంతో అందరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇంత సడన్ గా ఈ ఆస్తులను అమ్మడానికి గల కారణం ఏంటా అని ఆరా తీస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె అమెరికాలోనే ఉంటున్న నేపథ్యంలో ఇక్కడున్న అపార్ట్మెంట్స్ తో పనిలేదని, అందుకే వాటిని నమ్మకానికి పెట్టిందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు .మరి ఏది నిజమో తెలియదు కానీ మొత్తానికి అయితే ప్రియాంక చోప్రా మూడు ఖరీదైన ఫ్లాట్లను అమ్మేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై కూడా నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×