Jana Nayagan : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న చివరి సినిమా ‘జననాయగన్’ (Jana Nayagan). విజయ్ కెరీర్ లోనే 69వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తుండగా, హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా, అది సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. త్వరలోనే ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మూవీని ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు అనేది తాజా సమాచారం.
సినిమాపై ఎలెక్షన్స్ ఎఫెక్ట్
ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ‘జననాయగన్’ మూవీ షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు చిత్రపరిశ్రమలో ఇదే తన చివరి ప్రాజెక్టు అవుతుందని విజయ్ కన్ఫర్మ్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం త్వరలోనే విజయ్ ఈ ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నారు. మార్చి చివరి నుంచి 2025 ఏప్రిల్ మొదటి వారం ‘జననాయగన్’ మూవీకి సంబంధించిన షూటింగ్ ను విజయ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. జూన్ కల్లా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టబోతున్నారు అని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి, తమిళనాడు అంతటా రానున్న ఎలక్షన్స్ కోసం ప్రచారం చేయడం ప్రారంభిస్తాడని టాక్ నడుస్తోంది. అలాగే ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.
అయితే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసిన అనంతరం విజయ్ తన రాజకీయ పనుల్లో నిమగ్నం కానున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై పోటీ చేయడం, పార్టీ తరపున ప్రచారం వంటి విషయాలపై దళపతి విజయ్ పూర్తిగా ఫోకస్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ రిలీజ్ టైమ్ లో ఎలాంటి వివాదాలు తలెత్తకూడదని మేకర్స్ తో పాటు విజయ్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
ఇదిలా ఉండగా ఈ సినిమా టీచర్ నువ్వు బిజీ పుట్టినరోజు కానుకగా 2025 జూన్ 22న రిలీజ్ చేయవ్ సే అవకాశం ఉంది. కాని దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందించబోతున్నారు.
సినిమాల నుంచి తప్పుకోబోతున్నట్టు విజయ్ ప్రకటించినప్పటి నుంచి ‘జననాయగన్’ నిజంగానే ఆయన చివరి సినిమా అవుతుందా? లేదంటే విజయ్ మళ్లీ బిగ్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇస్తారా ? అనే విషయంపై చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల తన రాజకీయ పార్టీ టీవీకే సమావేశంలో దళపతి విజయ్ సినిమా నుంచి పూర్తిగా తప్పుకుంటానని, ఇకపై రాజకీయాలకే తన జీవితాన్ని అంకితం చేస్తానని కన్ఫర్మ్ చేశారు. దీంతో విజయ్ చివరి సినిమా గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.