Rohit Sharma Retirement: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి ఆయా జట్లు ఓటమిని చవిచూసి టోర్నీ నుండి నిష్క్రమించిన తర్వాత పలు జట్ల ఆటగాళ్లు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్టీవ్ స్మిత్, ముష్ఫికర్ రహీమ్ వన్డే ఫార్మాట్ కి గుడ్ బై చెప్పగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. దీంతో ఇప్పుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చర్చ జరుగుతోంది.
Also Read: Mohammed Shami: షమీ ఎనర్జీ డ్రింక్స్ వివాదం… మళ్లీ గెలికిన షామా మహ్మద్
రోహిత్ శర్మ కూడా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు రిటైర్మెంట్ లేదా కెప్టెన్సీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఎదురులేని విజయాలతో ఫైనల్ కీ చేరుకుంది. గ్రూప్ దశలో టాపర్ గా నిలవడంతో పాటు సెమీస్ లో ఆస్ట్రేలియా జట్టును ఓడించడంతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దీంతో దుబాయ్ వేదికగా ఆదివారం రోజున న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్లో రోహిత్ సేన పోటీ పడబోతోంది.
ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ వన్డే, టెస్ట్ జట్ల కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఘోర ఓటమి తర్వాత బోర్డ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రోహిత్ శర్మ భవిష్యత్ గురించి సైతం చర్చ జరిగినట్లు సమాచారం.
అయితే ఆ మీటింగ్ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని అన్నాడు రోహిత్. కానీ భవిష్యత్ కార్యాచరణ దృశ్య రాబోయే వరల్డ్ కప్ నాటికి జట్టును రెడీ చేసుకోవాలని రోహిత్ శర్మ కి కోచ్, చీఫ్ సెలెక్టర్ చెప్పారని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే తన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్న అంశం గురించి యాజమాన్యం అతడిని అడిగింది. కానీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అన్నది పూర్తిగా అతడి నిర్ణయమే.
Also Read: IPL Tickets Scam: SRH ఫ్యాన్స్ కు షాక్.. ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ !
అయితే కెప్టెన్సీ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ మార్పు వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తుంది. ఫిట్నెస్ బాగున్నంత కాలం ప్లేయర్ గా కొనసాగేందుకు రోహిత్ శర్మ సుముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీమిండియాని నాలుగు సార్లు ఫైనల్ కి చేర్చిన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. 2023 నుండి 25 వరకు భారత జట్టును icc టోర్నమెంట్లలో ఫైనల్ కీ చేర్చడం ద్వారా రోహిత్ శర్మ మరోసారి తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు.