Amitabh Bachchan.. ప్రముఖ బాలీవుడ్ బిగ్ బీ గా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ వయసులో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. నటనకు వయసుతో సంబంధం లేదు అని నిరూపిస్తున్న ఏకైక హీరో కూడా ఈయనే అని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో ఒక పోస్ట్ పంచుకున్నారు అమితాబ్ బచ్చన్. “ఇది వెళ్లే సమయం” అంటూ ఆయన ఎక్స్ ద్వారా ట్వీట్ చేయడంతో అందరూ కంగారు పడ్డారు. సోషల్ మీడియాలో రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలైంది. ఇక రోజురోజుకీ వార్తలు దావణంలా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలకు, తాను చేసిన ట్వీట్ కి అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు.
ట్వీట్ పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్..
తాజాగా కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో హోస్ట్ గా పని చేస్తున్న అబితాబ్ మాట్లాడుతూ..” నేను ట్వీట్ లో వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాను. అందులో తప్పేమీ లేదు. నేను షూటింగ్ కి వెళ్లాల్సిన సమయం వచ్చిందని ఆ పోస్ట్ ద్వారా తెలిపాను. నేను పెట్టిన ట్వీట్ కి కూడా అర్థం అదే. మీరు రాత్రి రెండు గంటలకు కూడా ఇలా సరదా ప్రశ్నలు అడుగుతున్నారా? నేను ఎప్పుడు ఇంటికి వెళ్లాలి? ఎప్పుడు నిద్రించాలి? అని.. అంటూ ప్రేక్షకులను తన మాటలతో మరొకసారి ఆకట్టుకున్నారు అమితాబ్ బచ్చన్. మొత్తానికైతే ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులకు క్లారిటీ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో కూడా అభిమానులకు ఝలక్ ఇస్తూ.. సరదాగా కామెంట్లు చేయడం గమనార్హం.
అమితాబ్ బచ్చన్ సినిమాలు..
అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే.. ఈయన త్వరలో ఆంఖే 2, జైమానత్, కాక్టెయిల్ 2, హన్ముఖ్ పిఘల్ గయే వంటి చిత్రాలలో కనిపించనున్నారు. ఈయన చివరిగా బ్రహ్మాస్త్ర, కల్కి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో మెప్పించారు. జనాలకు ఈ సినిమాలు బాగా మెచ్చడంతో పాటు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. పైగా ఆయన నటనపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు బ్రహ్మస్త్ర 2 రెండవ భాగంలో కూడా కనిపించబోతున్నారు. అంతేకాదు కల్కి 2 లో కూడా నటించబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే 2026 లో బిగ్ స్క్రీన్ పై బ్రహ్మాస్త్ర 2 రిలీజ్ కానుండగా కల్కి2 కి ఇంకాస్త సమయం పట్టేటట్టు కనిపిస్తోంది. మొత్తానికి అయితే అమితాబ్ బచ్చన్ తాను చేసిన ట్వీట్ కి రిప్లై ఇచ్చి అందరిని సంతోషపరిచారు. ఇక అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా అవకాశం వచ్చి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంది అనిపిస్తే.. ఖచ్చితంగా నటించడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నా.. మరొకపక్క పలు యాడ్స్ చేస్తున్నారు. అలాగే కొన్ని షోలకి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ మరింత బిజీగా మారిపోయారు అమితాబ్ బచ్చన్.