Brahmamudi serial today Episode: కోటర్ కమలేష్ కోసం వెతుకుతున్న అప్పు, కావ్యల దగ్గరకే వచ్చి కోటర్ కోసం డబ్బులు అడుగుతాడు కమలేష్. అప్పు తిడుతుంది. డబ్బులు లేవని.. ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని వార్నింగ్ ఇస్తుంది. కావ్య మాత్రం డబ్బులు తీసి ఇస్తుంది. డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంటే.. కావ్యకు అనుమానం వచ్చి కమలేష్ అని పిలుస్తుంది. దీంతో కమలేష్ కాదు.. కోటర్ కమలేష్ అని చెప్తాడు.
కోర్టులో వాదోపవాదాలు జరగుతుంటాయి. ఇదంతా అనామికే కావాలని ఇదంతా చేసిందని రాజ్ చెప్తాడు. అవునని రాజ్ తరపు లాయరు వాదిస్తాడు. అనామిక గతంలో రాజ్ తమ్ముడు కళ్యాణ్‌ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఆ కుటుంబాన్ని వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఆస్థి కోసం కోర్టుకు వెళ్లింది. ఆ కేసు కూడా నేనే వాదించాను. అనామిక క్రిమినల్ మైండ్ అందుకు సంబంధించిన ఆధారాలు నాతో ఉన్నాయి. అలాగే సామంత్ కూడా బిజినెస్ లో లాస్ వచ్చింది. అనామికే సామంత్‌ను ఏదో చేసింది అని వాదిస్తుంటాడు.
కమలేష్‌కు డబ్బులిచ్చిన తర్వాత కావ్య ఆ రోజు రాత్రి ఫ్యాక్టరీ దగ్గర ఒక వ్యక్తిని నువ్వు డబ్బులు అడగ్గానే.. నీకు ఐదు వందలు ఇచ్చాడు కదా అది గుర్తు చేసుకోమని అడుగుతుంది. కమలేష్ గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి అనామిక కొంత మంది రౌడీలతో అక్కడికి రాగానే తాను వెళ్లి డబ్బులు అడిగిన విషయం.. అనామిక తనను తోసేసిన విషయం.. రాజ్ ఐదు వందలు ఇచ్చిన విషయం గుర్తు చేసుకుని చెప్తాడు. మహానుభావుడు నేను 55 రూపాయలు అడిగితే ఐదు వందలు ఇచ్చాడు అని చెప్పగానే ఆ మహానుభావుడే ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు అని కావ్య చెప్తుంది.
ఏంటి నాకు ఐదు వందలు ఇచ్చిన నా దేవుడు ప్రాబ్లమ్‌లో ఉన్నారా..? అని అడుగుతాడు. దీంతో కావ్య అవును ఆయన మీద ఇప్పుడు హత్యా కేసు మోపారు. ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు అని చెప్పగానే.. హత్యా నేరమా ఎలా మేడం అని అడగ్గానే.. ఎవరో హత్య చేసి డెడ్ బాడీని సార్ కారు డిక్కీలో పెట్టారు అని కావ్య చెప్తుంది. నువ్వు కోర్టుకు వచ్చి మాకు చెప్పిందంతా చెబితే ఆయన బయటకు వస్తారు అని అప్పు చెప్తుంది. దీంతో కమలేష్ సార్ కోసం కోర్టుకే కాదు మేడం చంద్రమండలానికైనా వస్తాను అంటాడు. దీంతో అప్పు చంద్రమండలానికి ఇస్త్రో పర్మిషన్ ఇవ్వదు కానీ ప్రస్తుతానికి కోర్టకు వెళ్దాం పద అంటుంది.
రాజ్ తరపు న్యాయవాది సమర్పించిన సాక్ష్యాలు కూడా రాజ్ హత్య చేశాడనే చూపిస్తున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు. స్పాట్‌లో దొరికిన రాడ్ మిగతా వస్తువులను పరిశీలిస్తే.. ఈ హత్య రాజే చేశాడని వాదిస్తుంటే.. ఇంతలో కోర్టుకు కమలేష్‌ను తీసుకుని అప్పు, కావ్య వస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇతనెవరు అని కమలేష్‌ను అడగ్గానే.. ఈ కేసులో కీలక సాక్షి ఇతను అని అప్పు చెప్తుంది. దీంతో ఇప్పటికి ఇప్పుడు ఎలా పుట్టాడు అని లాయర్ అడగ్గానే.. ఇప్పటికి ఇప్పుడు పుట్టలేదు సార్ ముందు నాన్న పుట్టాడు. తర్వాత మా అమ్మ పుట్టింది. తర్వాత వాళ్లిద్దరూ ఒకట్టైతే నేను పుట్టాను అని వెటకారంగా చెప్తాడు. ఇంతలో జడ్జి నువ్వు ఏమైనా చెప్పాలని అనుకుంటే బోనులోకి వచ్చి చెప్పు అంటాడు.
కమలేష్ బోనులోకి వెళ్లి నిజం చెప్తుంటే.. అసలు నువ్వు అక్కడే ఉన్నావనడానికి సాక్ష్యం ఏంటి.. నీతో అబద్దం చెప్పిస్తున్నారేమో కదా అంటాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో కమలేష్ నేను అక్కడే ఉన్నాను అనడానికి నా ఫోనే సాక్ష్యం ప్రతి రోజు రాత్రి తాగాక పాట పాడుతూ వీడియో తీసుకోవడం నాకు అలవాటు ఆరోజు కూడా వీడియో తీశాను కావాలంటే చూడండి అని చెప్తాడు. రాజ్ తరపు లాయర్ ఆ ఫోన్ తీసి జడ్జికి ఇస్తాడు. ఆ ఫోన్‌లో ఉన్న వీడియో టీవీలో ప్లే చేసి చూస్తారు. దీంతో జడ్జి అనామికను బోనులోకి పిలిచి విచారిస్తాడు. దీంతో ఆ రోజు ఏం జరిగిందో అనామిక చెప్తుంది. సామంత్, అనామిక మధ్య గొడవ జరగడంతో తానే రాడ్ తో సామంత్‌ను చంపినట్టు తర్వాత శవాన్ని రాజ్ కారులో పెట్టినట్టు ఒప్పుకుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?