Anurag kashyap:ఒకప్పుడు టాలీవుడ్ అంటే చిన్నచూపు చూసిన ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు నేడు టాలీవుడ్ హీరోలతో అలాగే టాలీవుడ్ దర్శకులతో కలిసి పని చేయడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా నేడు తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ దూసుకుపోతున్న నేపథ్యంలోనే బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు టాలీవుడ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం బాలీవుడ్ మారడం లేదు కాబట్టి నేను సౌత్ కి వెళ్ళిపోతున్నాను అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
సౌత్ కి వెళ్ళిపోతాను..
టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ శిష్యుడిగా కెరియర్ మొదలుపెట్టాడు అనురాగ్ కశ్యప్. దర్శకుడిగా ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చి, బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా మారిపోయారు. దర్శకుడిగా సినిమాలు చేస్తూనే అటు నటుడిగా, నిర్మాతగా కూడా బిజీ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈయన సినిమాలు బాలీవుడ్ కమర్షియల్ సినిమాలకు చాలా భిన్నంగా ఉంటాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. బాలీవుడ్ ని వదిలేస్తున్నాను అంటూ సంచలన కామెంట్లు చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు కోసమే బాలీవుడ్లో సినిమాలు చేస్తారు..
ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. నేను ఇప్పుడు ప్రయోగాలు ఏమాత్రం చేయలేను. ప్రస్తుతం ఉన్న నిర్మాతలు కేవలం లాభాల కోసం మాత్రమే చూస్తున్నారు. ఫిలిం మేకింగ్ లోని ఆనందాన్ని పూర్తిగా వదిలేశారు. అందుకే నేను నెక్స్ట్ ఇయర్ ముంబై నుంచి సౌత్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎక్కడైతే ఇన్స్పైరింగ్ వర్క్ ఉంటుందో.. అక్కడికే నేను వెళ్తాను.. లేకపోతే ఇలాగే ముసలివాడినయి చచ్చిపోతాను. ఈ బాలీవుడ్ నన్ను చాలా నిరుత్సాహపరుస్తోంది. అలాగే మంజుమ్మెల్ బాయ్స్ లాంటి చిత్రాలను బాలీవుడ్ లో చూడరు. కానీ వాళ్లు దానిని రీమిక్స్ చేయాలని మాత్రమే అనుకుంటారు. ఏదీ కొత్తగా చేయడానికి ప్రయత్నించడం లేదు. అసలు క్రియేటివ్ గా చేయడానికి రిస్క్ తీసుకోవట్లేదు. ముఖ్యంగా కొంతమంది యాక్టర్స్ నటించడానికి కంటే కూడా స్టార్స్ అవ్వడానికి మాత్రమే చూస్తున్నారు అంటూ సంచలన కామెంట్లు చేశారు అనురాగ్ కశ్యప్. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్ లు వైరల్ అవుతున్నాయి.
అనురాగ్ కశ్యప్ కెరియర్..
ఇకపోతే అనురాగ్ కశ్యప్ విషయానికి వస్తే.. సౌత్ సినీ ఇండస్ట్రీలో తమిళ్, మలయాళం సినిమాలలో నటించాడు. ఒకవేళ ఆయన దర్శకుడిగా కాకుండా నటుడిగా ఫోకస్ పెట్టాడంటే మాత్రం అవకాశాలు భారీగా వచ్చి. మరి సౌత్ కి వచ్చి నటుడిగా మారుతారా? లేక దర్శకుడు అవుతారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే అనురాగ్ కశ్యప్ విషయానికి వస్తే.. చివరిగా ఈయన కెన్నడీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. నటుడిగా ఇటీవలే తమిళ్ సినిమా ‘విడుదల 2’ లో కూడా కనిపించారు అనురాగ్ కశ్యప్. ప్రస్తుతం ఈయన తీసుకున్న నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మరి నిజంగానే ఈయన బాలీవుడ్ ని వదిలి సౌత్ కి వస్తారేమో తెలియాల్సి ఉంది.