Horoscope taurus 2025 : గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం వృషభ రాశి జాతకులకు ఆదాయం -11, వ్యయం-5గా ఉంది. అంటే పదకొండు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు పెడతారు. ధన పరంగా వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. ఇక రాజ్యపూజ్యం-1, అవమానం – 3 గా ఉంది. అంటే ఒకరు మీకు గౌరవం ఇస్తే.. ముగ్గురు మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి : వృషభ రాశికి చెందిన మిలటరీ, పోలీస్, విద్యుత్ రంగాలవారు జనవరి నెలలో అప్రమత్తంగా ఉండాలి. ఇటుకబట్టీలు, కుమ్మర్లు, కమ్మర్లు, హోటల్స్, అగ్ని సంబంధ వృత్తుల వారికి ఈ నెలలో నష్టాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో గొడవలు అయ్యే సూచనలు అధికంగా ఉన్నాయి.
ఫిబ్రవరి : మేష రాశి జాతకులకు ఈ నెలలో వృత్తి వ్యాపార వ్యవహారములందు ధన ధాన్యలాభం, కుటుంబంలో సుఖశాంతులు ఉండును. దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు పోవుదురు, సంగీత, సాహిత్య, నాట్య రంగముల వారికి అభివృద్ధి కలుగును.
మార్చి : వృషభ రాశి జాతకులకు ఈ నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా పోలీసు, విద్యుత్ శాఖలందు పనిచేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అనుకూల బదిలీలు ఉంటాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. పాలు, పెరుగు, వెండి, బంగారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
ఏప్రిల్ : వృషభ రాశి జాతకులకు ఈ నెలలో అమితంగా ధనలాభం ఉంటుంది. ఈ నెలలో తియ్యటి పదార్థములు తిన్నచ్చో మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో సంతోష కరమైన వాతావరణం ఏర్పడుతుంది.
మే : వృషభ రాశి జాతకులకు ఈ నెలలో శారీరక, మానసిక స్థితి చాలా బాగుంటుంది. సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. వస్తులాభం ఉంటుంది. ద్రవ్యప్రాప్తి కలుగుతుంది. ఈ నెలలో సుఖఃశాంతులతో ఉంటారు. వ్యవసాయ, వ్యాపారాభివృద్ధి జరుగును.
జూన్ : వృషభ రాశి జాతకులకు ఈ నెలలో వృత్తి, వ్యాపారాలలో అభివృద్ది కలుగుతుంది. దీర్ఘకాలిక రోగముల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది. దూర ప్రయాణములు చేస్తారు. నెల ప్రారంభంలో అభివృద్ధి సాధిస్తారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
జూలై : వృషభ రాశి జాతకులకు ఈ నెలలో అకస్మిక ధన లాభం ఉంది. అయినా ప్రతి విషయంలోనూ ఆందోళనగా ఉంటారు. కుటుబంలో కలహాలు ఏర్పడే సూచనలున్నాయి. స్త్రీలు అధికంగా ధన వ్యయం చేస్తారు. సోదరులకు అనారోగ్య సూచనలున్నాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి.
ఆగష్టు : వృషభ రాశి జాతకులకు ఈ నెలలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ నెలలో వృషభ రాశి స్త్రీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సెప్టెంబర్ : వృషభ రాశి జాతకులకు ఈ నెలలో ఇంట్లో గొడవలు జరిగే చాన్స్ ఉంది. కుటుంబ సభ్యుల విషయంలో ఆందోళన చెందుతారు. ఇతరుల కోపం మీ సమయాన్ని వృథా చేసుకుంటారు. ఈ నెలలో ఉపాధ్యాయులకు సన్మానములు జరిగే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు సామాన్య లాభాలున్నాయి.
అక్టోబర్ : వృషభ రాశి జాతకులకు ఈ నెలలో ఉద్యోగ విషయంలో పట్టుదలతో వ్యవహరించిన కార్యజయం కలుగుతుంది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యవసాయదారులకు ఈ నెలలో లాభాలు ఉన్నాయి.
నవంబర్ : వృషభ రాశి జాతకులకు ఈ నెలలో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొంటాయి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కానీ సమాజంలో సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి.
డిసెంబర్ : వృషభ రాశి జాతకులకు ఈ నెలలో ఆదాయం పెరుగును, ఖర్చులు పెరుగును. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల రాక ఇంట్లో ఖర్చులు పెంచుతుంది. సోమరితనము తగ్గి పనిలో నిమగ్నమవుతారు. కళాకారులకు శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?