RAPO22: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత ఉస్తాద్ రామ్ గా మారిన ఈ కుర్ర హీరోకు ఇప్పటివరకు అంత హిట్ పడింది లేదు. రెడ్, హలో గురు ప్రేమకోసమే, ది వారియర్, స్కంద లాంటి సినిమాలు పరాజయాలను అందుకున్నాయి. ఇక దీంతో రామ్.. గతేడాది రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ తో అయిన హిట్ అందుకుంటాడు అనుకుంటే.. అది వాటికంటే డిజాస్టర్ అయ్యి కూర్చుంది. అయినా నిరాశపడకుండా రామ్.. మంచి కథలను ఎంచుకొని హిట్ కొట్టడానికి సిద్ధపడుతున్నాడు.
ఇక ఈ నేపథ్యంలోనే రామ్.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తన 22 వ సినిమాను ప్రకటించాడు. RAPO22 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాది రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మహేష్ బాబు డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
Anupama Parameswaran: వావ్.. వెరైటీ లుక్‌లో అనుపమ
ఒక సున్నితమైన అంశాన్ని కూడా ఎలాంటి విమర్శలు రాకుండా ఎంతో సెటిల్డ్ గా ఆ సినిమాను తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇక ఇప్పుడు ఆ సినిమా తరువాత అతనికి రామ్ తో సినిమా చేసే అవకాశం దక్కింది. గతేడాది పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రామ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
సాగర్ అనే కాలేజ్ స్టూడెంట్ గా రామ్ కనిపించాడు. ఇక నేడు కొత్త ఏడాది ని పురస్కరించుకొని తమ సినిమాలోని మహాలక్ష్మిని అభిమానులకు పరిచయం చేశారు. సాగర్ గాడి లవ్వు.. మహాలక్ష్మీ అంటూ భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. అమ్మడి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీ అందాల కోసమే సినిమాకు వెళ్లిన ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
SSMB29: మహేష్ బాబు – రాజమౌళి మూవీ షూటింగ్ షురూ..!
ఇక ఈ చిత్రంలో కూడా భాగ్యశ్రీ తన అందంతో అభిమానులను కట్టిపడేసింది. రెడ్ కలర్ చుడీదార్ లో రామ్ ను చూసి సిగ్గుపడుతూ.. ఎంతో అందంగా కనిపించింది. రామ్ సైతం కొత్త లుక్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి మెర్విన్ సోలమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా రామ్ మంచి హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.