BigTV English

Bollywood: హీరోలతో పోటీ పడుతున్న రామ్ చరణ్ హీరోయిన్.. ఒక్కో సినిమాకి ఎన్ని కోట్లంటే..?

Bollywood: హీరోలతో పోటీ పడుతున్న రామ్ చరణ్ హీరోయిన్.. ఒక్కో సినిమాకి ఎన్ని కోట్లంటే..?

Bollywood:వాస్తవానికి ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్ లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని, తమ నటనతో, టాలెంట్ తో భారీ పాపులారిటీ అందుకున్న హీరోయిన్స్.. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వ్యాపార రంగంలో పెట్టుబడులుగా పెట్టి, రెండు చేతుల బాగా ఆర్జిస్తున్నారు. మరి కొంతమంది తమకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని పారితోషకం అమాంతం పెంచేసి, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇంకొకవైపు చాలామంది హీరోయిన్లు కెరియర్ పీక్స్ లో ఉన్నట్లుగానే వివాహం చేసుకొని ఆశ్చర్యపరుస్తారు. వివాహమైన తర్వాత అందరికీ అన్ని అవకాశాలు వస్తాయా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఆమె ఎవరో కాదు రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ramcharan ) హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్ కి జోడీగా నటించిన ఆలియా భట్(Alia Bhatt).


హీరోలతో సమానంగా పారితోషకం..

బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో అడుగుపెట్టిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ.. బ్లాక్ బాస్టర్ హిట్స్ తో దూసుకుపోయింది.’ గంగూభాయి కతియావాడి’ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇలా వరుస సినిమాలు చేస్తూ వివాహం తర్వాత కూడా దూసుకుపోతున్న ఆలియా భట్ ఒక్కో సినిమాకి రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుత జనరేషన్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇకపోతే టైర్2, టైర్ 3 హీరోల రెమ్యూనరేషన్ తో సమానంగా ఈమె పారితోషికం తీసుకోవడం గమనారం.


అలియా భట్ ఆస్తుల విలువ..

అంతేకాదు ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే బాలీవుడ్ సినిమా కోసం ఏకంగా 500,000 డాలర్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు యాడ్స్ లో కూడా నటిస్తోంది. ఇక పలు రంగాలలో పెట్టుబడులు పెట్టిన ఈమె భారీగా సంపాదిస్తుందని చెప్పవచ్చు. ఇక ఆలియా కి సుమారుగా రూ.600 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎండార్స్మెంట్స్, బిజినెస్ వెంచర్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తోంది. అంతేకాదు చిన్నపిల్లల డ్రెస్సుల బ్రాండ్ ‘ఎడ్ ఏ మమ్మా’ ను కూడా స్థాపించింది. ఈ బిజినెస్ విలువ సుమారుగా రూ.150 కోట్ల పై మాటే.. ఇక ముంబై, లండన్ వంటి ప్రదేశాలలో విలాసవంతమైన భవనాలు అలాగే కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు ఈమె సొంతం. ఇకపోతే పెళ్లి జరిగి కూతురుకి జన్మనిచ్చిన తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ.. జోరు పెంచేసింది అలియా భట్. ఏది ఏమైనా ఈమె క్రేజ్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×