Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) రిటైర్మెంట్ ప్రకటన చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా రవిచంద్రన్ అశ్విన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. టీమిండియాలో జరిగే కొట్లాట , అవమానాల కారణంగానే… సడన్గా రిటర్మెంట్ ప్రకటించాడని రవిచంద్రన్ అశ్విన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని… ఆల్రౌండర్ అశ్విన్ ( Ravichandran Ashwin ) కూడా చెబుతున్నారు.
Also Read: Gianluigi Donnarumma Injury: ఇదేం ఆట… ముఖంపై బూటుతో తన్ని మరీ ?
అయితే ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్…. ఫోన్ కాల్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తన తండ్రి, తన భార్య, అలాగే సచిన్ టెండూల్కర్ తో పాటు కపిల్…. రవిచంద్రన్ అశ్విన్ కు ఫోన్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని తాజాగా అశ్విన్ సోషల్ మీడియా వేదికగా తెలపడం జరిగింది.
రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తనకు వచ్చిన ఫోన్ కాల్స్ స్క్రీన్ షాట్ ను తీసి మరి సోషల్ మీడియాలో పెట్టాడు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ సందర్భంగా హార్ట్ ఎటాక్ అంటూ కామెంట్ కూడా చేశాడు. గడిచిన 25 సంవత్సరాల కిందట ఎవరైనా నా దగ్గర స్మార్ట్ఫోన్ ఉంటుందని… ఊహించలేదని తెలిపారు. టీమిండియా క్రికెటర్ గా తన కెరీర్ చివరి రోజు కాల్ లాగ్ ఇలా ఉంటుందని చెబితే… నాకు అప్పుడే గుండెపోటు వచ్చి ఉండేది… అంటూ ఆసక్తికర ట్వీట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్.
అంతేకాదు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) అలాగే కపిల్ దేవ్ ( Kapil Dev ) లాంటి గొప్ప క్రికెటర్ల నుంచి తనకు ఫోన్ కాల్ రావడం ఆశీర్వాదంగా ఫీల్ అవుతానని చెప్పుకొచ్చాడు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) రిటైర్మెంట్ తర్వాత అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని దానిపైన చర్చ జరుగుతుంది. టీమిండియా స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ రాణించడం… జట్టుకు ఎన్నో విజయాలను సాధించడం జరిగింది. మరి అలాంటి స్థానాన్ని భర్తీ చేసే మొనగాడు ఎవరు అనే సెర్చ్ చేస్తున్నారు.
Also Read: Mohammed Rizwan Haris Rauf: SRH ప్లేయర్ ను కెలికిన పాక్ క్రికెటర్లు.. మ్యాచ్ మధ్యలో గొడవ
ప్రస్తుత లెక్కల ప్రకారం…. వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ), అక్షర్ పటేల్, అంతేకాదు.. కుల్దీప్ యాదవ్ పేర్లు చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు అశ్విన్ వారసుడిగా టీమిండియాలో కొనసాగుతారని… అంటున్నారు క్రీడా విశ్లేషకులు. అయితే చాలామంది అశ్విన్ వారసుడిగా… ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరు సూచిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టుల్లో వాషింగ్టన్ సుందర్ రాణించిన సంగతి తెలిసిందే.
If some one told me 25 years ago that I would have a smart phone with me and the call log on the last day of my career as an Indian cricketer would look like this☺️☺️, I would have had a heart attack then only. Thanks @sachin_rt and @therealkapildev paaji🙏🙏 #blessed pic.twitter.com/RkgMUWzhtt
— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 20, 2024