BigTV English

Sameera Reddy: బిగ్ బాస్ కు టాలీవుడ్ హీరోయిన్.. ఈసారి కన్ఫర్మ్ ..?

Sameera Reddy: బిగ్ బాస్ కు టాలీవుడ్  హీరోయిన్.. ఈసారి కన్ఫర్మ్ ..?

Sameera Reddy: బిగ్ బాస్ సీజన్ మొదలయ్యింది. ఎక్కడ చూసినా బిగ్ బాస్ .. బిగ్ బాస్ పేరునే వినిపిస్తుంది. ఇప్పటికే తెలుగులో నాగార్జున సీజన్ 8 ప్రోమో కూడా వదిలారు. ఇంకోపక్క తమిళ్ లో కమల్ హాసన్ ఈసారి బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించడం లేదని అధికారికంగా ప్రకటించాడు. ఈ రెండు కాకుండా హిందీలో కూడా బిగ్ బాస్ మొదలుకానుంది.


నిజం చెప్పాలంటే అసలు బిగ్ బాస్ అనే రియాలిటీ షోను మొదలుపెట్టిందే బాలీవుడ్. ఇప్పటివరకు 17 సీజన్స్ జరిగాయి. ఈ 17 సీజన్స్ కు కండల వీరుడు సల్మాన్ ఖాన్ నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఎన్నోసార్లు హోస్ట్ గా చేయను అని చెప్పినా బిగ్ బాస్ యాజమాన్యం అతన్ని తప్ప వేరొకరిని హోస్ట్ గా ఊహించుకోలేమని చెప్పి.. పారితోషికం పెంచి అయినా సల్లు భాయ్ నే హోస్ట్ గా వ్యవహరించేలా చేస్తూ వస్తున్నారు.

ఇక త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 18 మొదలుకానుంది. ఇప్పటివరకు హిందీ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన కంటెస్టెంట్స్ బయటకు వచ్చి మంచి పొజిషన్ లో ఉన్నారు. అందుకే హిందీ బిగ్ బాస్ కు వెళ్ళడానికి సెలబ్రిటీలు కూడా ఎగబడుతూ ఉంటారు. తాజాగా బిగ్ బాస్ 18 లో కూడా స్టార్ సెలబ్రిటీలు వస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈసారి బిగ్ బాస్ 18 కు హీరోయిన్ సమీరా రెడ్డి వస్తుందని టాక్.


తెలుగులో కూడా సమీరాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ సరసన ఆమె నరసింహుడు, అశోక్ వంటి సినిమాల్లో నటించింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సమీరా అక్షయ్ వర్ధే అనే వ్యక్తిని వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు.

ఇక పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమీరా.. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. గత రెండు సీజన్స్ కు సమీరాను అడగ్గా.. కొన్ని కారణాల వలన ఆమె నో చెప్పినా.. ఈ సీజన్ కు మాత్రం కచ్చితంగా సమీరా ఎస్ చెప్పిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇదేకనుక నిజమైతే.. తెలుగు ప్రేక్షకులు కూడా సమీరాకు సపోర్ట్ గా నిలబడతారేమో చూడాలి.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×