BigTV English
Advertisement

Tollywood Actress: ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్

Tollywood Actress: ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్

Do you Remember the Child in this Pics she is Tollywood Actress is keerthy Suresh: ఈ మధ్యకాలంలో సెలబ్రెటీల చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నాయి. ఈ ఫొటోలో క్యూట్ క్యూట్ గా కనిపిస్తున్న బూరుబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్.. ఈ బ్యూటీ నేషనల్ అవార్డు కూడా అందుకుంది. తెలుగు, తమిళ్‌లోనే కాదు బాలీవుడ్ లోను మూవీస్ చేస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?


నవతరం నాయిక కీర్తి సురేష్ పేరువినగానే ముందుగా గుర్తొచ్చేది మహానటి సావిత్రి. తెలుగు ఇండస్ట్రీలోనే పలు వెలుగులు విరజిమ్మిన కీర్తి సురేష్.. కీర్తి కిరీటంలో మహానటి చిత్రం మేలిమి రత్నంగా మెరిసింది. జాతీయ స్థాయిలో కీర్తి సురేష్ ను ఉత్తమ నటిగా నిలిపిన మహానటిని జనం మర్చిపోలేరు. ఆ సినిమా తర్వాత సాంప్రదాయ బద్దంగా సాగుతోంది కీర్తి సురేష్.


కీర్తి సురేష్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు. మేనక అప్పట్లో చిరంజీవి పున్నమి నాగు సినిమాలో కథానాయికగా నటించారు. కీర్తిసురేష్ తండ్రి మలయాళ దర్శకుడు. కీర్తి సురేష్ పైలెట్స్, నీకిష్టం, కుబేరన్ వంటి చిత్రాలలో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ప్రియదర్శన్ తెరకెక్కించిన గీతాంజలి అనే హార్రర్ మూవీలో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ తర్వాత తెలుగులో నేను శైలజ సినిమాలో రామ సరసన నటించి ఇట్టే తెలుగువారిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

Also Read: గుల్లేడు గుల్లేడు సాంగ్ కు గులామ్ అయ్యేలా ఉన్నామే.. అదిరిపోయింది

నానితో కలిసి నేను లోకల్ సినిమాలో ముద్దుగా మురిపించింది. అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ తో నటించింది. ఇక సావిత్రి జీవిత గాధగా తెరకెక్కిన చిత్రం మహానటి సినిమాలో నటించి మెప్పించింది. ఈ మూవీలో తన నటనకు గాను జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది. మన్మధుడు2లో ప్రత్యేక పాత్రలో కనిపించింది ఈ భామ. పెంగ్విన్, మిస్ ఇండియా వంటి ఓటీటి లలోను కీర్తి అభినయం ఆకట్టుకుంది. నాని సరసన దసరా మూవీలో కూడా నటించింది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.

ఇక జాతిరత్నాలలో కాసేపే కనిపించిన కవ్వించింది. రంగ్ దే లో నితిన్ తో జోడీకట్టింది. కీర్తి సురేష్ నటించిన కొన్ని పరభాష చిత్రాలు సైతం తెలుగులో అనువాదించారు కూడా.. ఆ తర్వాత మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట మూవీలో నటించింది. భోళా శంకర్, గుడ్ లక్, సఖి వంటి పలు సినిమాల్లో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×