Tabu:బాలీవుడ్ నటి టబు(Tabu) తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమే..తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ, 50 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టబు పేరు ఇండస్ట్రీలో వినిపిస్తే చాలు.. ఆమె పెళ్లి గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. ఇప్పటికే టబు పెళ్లి వార్తల కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే అలాంటి టబుపై ఇప్పటికే ఎన్నో పెళ్లి రూమర్లు కూడా వినిపించాయి. టబు ముంబై బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంటుందని ఒకసారి వార్తలు రాగా.. మరొకసారి టాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకుంటుందని అలాగే బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకుంటుందని ఇలా ఎంతోమందితో పెళ్లి రూమర్లు వినిపించాయి. కానీ ఒక్కరితో కూడా పెళ్లి జరగలేదు. ఇప్పటికీ టబు సింగిల్ గానే ఉంటుంది. ఇక పెళ్లి విషయంలో కాస్త లేటుగా ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా టబూ ప్రస్తుత వయసు 50 సంవత్సరాలు.. మరి ఇన్నేళ్లయినా.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరో అంటూ సంచలన కామెంట్లు చేసింది. ఆ హీరోకి భయపడి ఎవరూ.. నా దగ్గరకు రాలేదు అంటూ హాట్ కామెంట్స్ చేసింది టబూ.
అజయ్ దేవగన్ గన్ కి భయపడి ఎవరు నా దగ్గరకు రాలేదు..
మరి ఇంతకీ ఆ హీరో కాదు అజయ్ దేవగన్ (Ajay devagan). ఇక అప్పట్లో అజయ్ దేవగన్,టబు ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందని,వీరిద్దరూ చాలా రోజుల డేటింగ్ చేశారని,కానీ సడన్గా అజయ్ దేవగన్ టబు కి బ్రేకప్ చెప్పి, కాజోల్ ని పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇకపోతే కాజోల్ ను వివాహం చేసుకున్న మాట నిజమే కానీ, టబుతో ప్రేమాయణం నడిపారనే వార్తలలో నిజం లేదు. ఇదిలా ఉండగా అజయ్ దేవగన్ తో టబు ఎన్నో సినిమాల్లో చేసింది. అంతేకాదు సినిమా కంటే ముందే చిన్నప్పటినుండే టబుకి అజయ్ దేవగన్ తెలుసట. ఎందుకంటే టబు సోదరుడు సమీర్ ఫ్రెండే అజయ్ దేవగన్. వీరంతా చిన్నతనంలో జూహులో కలిసి తిరిగేవారట. అయితే అప్పటి విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ.. నా పెళ్లి జరగకపోవడానికి కారణం అజయ్ దేవగన్. ఎందుకంటే చిన్నతనంలో నేను, అజయ్ దేవగన్ అలాగే నా సోదరుడు సమీర్ అందరం ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసేవాళ్లం. అయితే అప్పట్లో నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరైనా అబ్బాయిలు నా వెంట పడితే మా అన్నయ్యతో కలిసి అజయ్ వాళ్లని చితక్కొట్టేవాడు. ఈ కారణంతో ఒక్కరు కూడా నన్ను కన్నెత్తి చూడలేదు. అబ్బాయిలు నాతో మాట్లాడడానికే భయపడిపోయేవాళ్లు. మా అన్నయ్య సమీర్, అజయ్ ల భయానికి అబ్బాయిలు అసలు నన్ను చూడడమే మానేశారు. ఇప్పుడు అర్థమైంది కదా నాకు ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి కారణం ఎవరో అంటూ సరదాగా చెప్పుకొచ్చింది టబు. ఇక టబు మాటల వెనుక అంతరార్థం ఏంటంటే.. టీనేజ్ లో ఉన్నప్పుడు అజయ్ దేవగన్ తన సోదరుడు ఇద్దరు తనకు బాడీగార్డ్ లా ఉన్నారని,ఏ అబ్బాయి కూడా తనతో మాట్లాడకపోవడానికి వాళ్లే కారణమని,ఒకవేళ వాళ్ళు అలా చేయకపోతే తనతో అబ్బాయిలు మాట్లాడి ఎవరో ఒకరితో ప్రేమలో పడిపోయేదాన్ని అంటూ పరోక్షంగా చెప్పింది.
అజయ్ వల్లే పెళ్లికి దూరం..
ఇకపోతే అజయ్ దేవగన్ తో తనకు పెళ్లి సంబంధం చూడమని చెప్పాను. కానీ నాకు ఎవరూ కూడా తొందరగా నచ్చరు అనే విషయం ఆయనకు తెలుసు. అందుకే ఆయన కూడా నాకు అబ్బాయిని వెతికి పెట్టడం లేదు అంటూ టబు చెప్పుకొచ్చింది. ఈ విషయం పక్కన పెడితే.. టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి అజయ్ దేవగన్ తో పాటు నాగార్జున పేరు కూడా వినిపిస్తుంది. నాగార్జున టబులు నిన్నే పెళ్లాడతా సినిమాలో చేసినప్పుడు ప్రేమలో పడ్డారని, వీరి ప్రేమ విషయం అమలకు కూడా తెలుసని, కానీ అమల వీరిని ఏమీ అనలేకపోయింది అంటూ ఇప్పటికి కూడా రూమర్లు వినిపిస్తాయి. అంతే కాదు హైదరాబాద్ కి టబు వచ్చినప్పుడల్లా నాగార్జున ఇంట్లోనే ఉంటుందని, ఇక వీళ్ళ ఇంటి దగ్గరే టబుకి అమలనే స్వయంగా ఓ ఇల్లు కూడా కట్టించింది అనే విషయం కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ టబుకు సంబంధించిన ప్రతి విషయం కూడా వైరల్ గా మారుతూ ఉంటుంది.