Mohammed Rizwan Haris Rauf: క్రికెట్ లో గొడవలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి చివరికి అవి పెద్దగా మారి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా సౌత్ ఆఫ్రికా – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో మరో గొడవ సంభవించింది. టి-20, వన్డే, టెస్ట్ సిరీస్ లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్ళింది. ఈ సిరీస్ లో ఇరుజట్ల మధ్య మూడు టి-20 లు జరగగా.. సౌత్ ఆఫ్రికా 2-0 తో ఈ సిరీస్ గెలుచుకుంది. ఇక ప్రస్తుతం వన్డే మ్యాచ్ లు జరుగుతున్నాయి.
Also Read: Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్ పై తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆ అవమానం వల్లే!
అయితే ఈ వన్డే సిరీస్ లలో పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు అంటే క్రికెట్ ప్రేమికులు కూడా బాగా ఆసక్తి చూపిస్తారు. ఇక ఇప్పటికే జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. కేప్ టౌన్ వేదికగా గురువారం రోజు రాత్రి రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాక్ జట్టు కైవసం చేసుకుంది.
ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ షఫిక్ అబ్దుల్లా డక్ ఔట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ నయీమ్ 25 పరుగులకే పెవిలియన్ చేరాడు. 49.5 ఓవర్లలో 329 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. బాబర్ అజామ్ 95 బంతుల్లో 73 పరుగులు చేసి రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ 82 బంతులలో 80 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కమ్రాన్ గులాబ్ 63 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు క్వేనా 4 వికెట్లు, మార్కో జాన్సేన్ 3 వికెట్టు పడగొట్టారు.
ఇక అనంతరం లక్ష్య చేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా తడబడింది. 43.1 ఓవర్లలో కేవలం 248 పరుగులకే కుప్ప కూలింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో క్లాసెన్ 74 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. త్రుటిలో సెంచరీని కూడా చేజార్చుకున్నాడు. ఇక పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రీది 4, నదీమ్ 3 వికెట్లు పడగొట్టారు. అయితే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సమయంలో 26వ ఓవర్ ని హరీష్ రౌఫ్ వేశాడు. ఈ 26 ఓవర్ లో లాస్ట్ బాల్ ని బౌన్స్ గా వేయడంతో దీన్ని ఆడడంలో క్లాసెన్ విఫలం అయ్యాడు.
Also Read: Imam Ul Haq: ఇండియాలో నరకం చూశాం…బెడ్ రూం నుంచి బయటకు పంపలేదు !
అయితే క్లాసెన్ వైపు ఆగ్రహంగా చూస్తూ రౌఫ్ ఏదో అన్నాడు. దీంతో మన SRH ఆటగాడు క్లాసెన్ కోపంగా ఊగిపోతూ మాటకి మాట సమాధానం చెప్పాడు. ఇది గమనించిన {Mohammed Rizwan Haris Rauf} మహమ్మద్ రిజ్వాన్ మధ్యలో కలగజేసుకుని క్లాసెన్ వైపు వేలు చూపిస్తూ ఏదో అన్నాడు. ఇక క్లాస్ అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా ముందడుగు వేశాడు. దీంతో అంపైర్లు కలగజేసుకొని మ్యాచ్ ని కొనసాగించాలని కోరారు. ఈ గొడవకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
&
If you shown aggression to Pakistan then you get the same treatment from them, no matter you’re South Africa or India 🔥💪#PAKvsSA #SAvPAKpic.twitter.com/xQVerbsmzZ
— World Sports (@worldsports__) December 19, 2024
nbsp;