Allu Arjun.. అల్లు అర్జున్ (Allu Arjun).. ఇది పేరు కాదు బ్రాండ్ అని మరోసారి నిరూపించుకున్నారు బన్నీ. ఒక్క సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ.. ఊహించని బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. సాధారణంగా ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మన తెలుగు హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతుండడం గొప్ప విశేషం అనే చెప్పాలి. ఒక సినిమాను మించి మరొక సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా చాటుతోంది. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అంటే చిన్నచూపు చూసిన ఎంతోమంది.. నేడు అదే తెలుగు సినిమా హీరోలతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. అంతేకాదు వందల కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ ను ఎరగా వేస్తూ తమ బ్యానర్లో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు..
అల్లు అర్జున్ ఒకప్పుడు మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చినా.. ఇప్పుడు తన టాలెంట్ తో సొంత స్టార్ డంను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా సూపర్ సక్సెస్ అవడంతో సూపర్ స్టార్ గా అవతరించారు బన్నీ. ముఖ్యంగా రీసెంట్గా విడుదలైన ‘పుష్ప 2’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రూ.1800 కోట్ల కలెక్షన్స్ తో ఊచకోత కోస్తున్న ఈ సినిమా లాంగ్ రన్ ముగిసే సరికి రూ.2000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు అని చెప్పవచ్చు. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
బన్నీ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్స్..
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈయనకు మార్కెట్ పెరగడంతో ఈయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ ప్రొడ్యూసర్లు కూడా క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘పుష్ప 2’ సినిమా కోసం ఏకంగా రూ. 300 కోట్లు వాటాగా తీసుకొని.. అత్యధిక వాటా తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించారు. అయితే ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేయబోతున్నారు బన్నీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి రూ.400 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినా సమస్య లేదంటూ.. పలువురు సినిమా ప్రొడ్యూసర్లు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న యశ్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మాతలు అయితే ఏకంగా తమతో సినిమా చేయమని, ఆయనకు బ్లాంక్ చెక్ కూడా ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో బన్నీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టు సమాచారం.
అల్లు అర్జున్ సినిమాలు..
ఇదిలా ఉండగా మరోవైపు బన్నీ త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నా.. ఏది ఏమైనా ఒక్క సినిమా దెబ్బతో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు అంటే అల్లు అర్జున్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు అని అభిమానులు సైతం సంబరపడిపోతున్నారు.