Nag Ashwin Mahanati : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లిస్ట్ ప్రస్తావన వస్తే వాటిలో వినిపించే పేర్లు రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్. రాజమౌళి సుకుమార్ పేర్లు పక్కన పెడితే నాగ్ అశ్విన్ తెరకెక్కించినవి కేవలం మూడు సినిమాలు మాత్రమే. వాటిలో మూడువ సినిమా కల్కి. కల్కి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేసినప్పుడు నాగ్ అశ్విన్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఒక బూతు పదం లేకుండా రక్తపాతం లేకుండా ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు. అయితే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. సందీప్ రెడ్డి వంగాను దృష్టిలో పెట్టుకొని నాగ్ అశ్విన్ అటువంటి పోస్ట్ పెట్టాడు అంటూ చాలామంది విమర్శలు కూడా చేశారు. వాటిని పెద్దగా తన దృష్టికి తీసుకోలేదు నాగి.
నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు నాగ్ అశ్విన్. దాదాపు 28 ఏళ్లు ఉన్నప్పుడే చాలా మెచ్యూర్డ్ గా ఆ సినిమాను తెరకెక్కించాడు. వాస్తవానికి నాది ఆ కథ కాకుండా వేరే కథతో చాలామంది నిర్మాతలు దగ్గరకు వెళ్ళాడు. అవి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. నిర్మాత స్వప్న ప్రియాంకకు చెప్పినప్పుడు కూడా వాళ్లకు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నే బాగా నచ్చింది. మొత్తానికి ఆ సినిమాను నమ్మి తెరకెక్కించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అయింది. ఆ సినిమా తర్వాత ఆ ఇంటికి అల్లుడు అయిపోయాడు నాగ అశ్విన్. నాగ్ అశ్విన్ తీసిన రెండవ సినిమా మహానటి. మహానటి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ బయోపిక్ సినిమాల ప్రస్తావన వస్తే మొదటి వినిపించే పేరు మహానటి.
ఇక మహానటి సినిమా గురించి నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ సినిమా తీయడానికి నాకు ఒక సిక్స్ అవర్స్ పాడ్ కాస్ట్ ఇన్స్పైర్ చేసింది అంటూ చెప్పాడు. అలానే ఆ టైంలో తనకు దొరికిన ఒక పుస్తకం ఇవన్నీ కూడా మహానటి సినిమాను తను చేసేలా ప్రేరేపించాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మహానటి సక్సెస్ ను తలకి ఎక్కించుకోకుండా, నాగి మాట్లాడిన విధానం చాలా బాగుంది. మనం ఒక గొప్ప కథను తీశాము అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు ఒక గొప్ప కథ మనల్ని దర్శకులుగా ఎంచుకుంటుంది. నేను చాలామంది సీనియర్ దర్శకులు విశ్వనాధ్, సింగీతం వంటి వాళ్లతో మాట్లాడినప్పుడు కొన్నేళ్ళు పోయిన తర్వాత ఈ సినిమా మేమే తీసామా అని అభిప్రాయం వస్తుందని తెలిపాడు. అది ఇప్పుడు మనకు అర్థం కాకపోయినా చాలా ఏళ్లు తర్వాత ఒక గొప్ప కథ మనల్ని ఎంచుకుంది అని అభిప్రాయం కలుగుతుంది అంటూ నాగస్విని చెప్పుకొచ్చాడు.
Also Read : Mad Square – Swathi Reddy Song : బిట్ సాంగ్ ని ఫుల్ సాంగ్ చేశారు, మళ్లీ మోత మోగనుంది