Bollywood star hero:సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు రాణించాలంటే అదృష్టంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. ఇక అదృష్టం ఒక్కటే ఉంటే సరిపోదు.అలాగే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఈ రెండూ ఉండాలి.ఈ రెండు ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. అలా ఈ రెండూ ఉన్న చాలా మంది ఇండస్ట్రీలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటూ అవకాశాలు ఉన్నప్పుడే కోట్లకు కోట్లు డబ్బులు వెనకేసుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది సెలబ్రిటీలు సినిమాల్లో చేయగా.. వచ్చిన డబ్బుతో ఖరీదైన ప్రాపర్టీలు, కార్లు, నగలు, ఇల్లు,పొలాలు, ప్లాట్లు కొనుగోలు చేస్తారు. అయితే మరికొంత మందేమో డబ్బులను జల్సాలకు ఉపయోగిస్తూ సంపాదించిన డబ్బంతా పోగొట్టుకుంటారు. అలాంటివారు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఈయన ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో రూ.80 కోట్లకు ప్రాపర్టీని అమ్మినట్లు తెలుస్తోంది.
ఖరీదైన ఫ్లాట్ అమ్మేసిన అక్షయ్ కుమార్..
మరి ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar ).. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అయితే అంత పెద్ద స్టార్ హీరో ఆర్థిక పరిస్థితి బాగాలేక రూ.80 కోట్లకు ప్రాపర్టీ అమ్మేయడం ఏంటని చాలామంది షాక్ అవుతున్నారు. అంత పెద్ద హీరో ఇప్పటివరకు ఎక్కువ ఆస్తులు కూడబెట్టలేదా.. ఎందుకు ఆస్తులను అమ్ముకున్నాడు అనే అనుమానం కూడా చాలామందిలో తలెత్తుతోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రీసెంట్ గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ముంబైలోని వాణిజ్య ప్రాంతం అయినటువంటి వర్లీలో తనకి ఉన్న అపార్ట్మెంట్ ని దాదాపు రూ.80 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తోంది.అయితే బీటౌన్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అక్షయ్ కుమార్ పల్లవి జైన్(Pallavi Jain) అనే వ్యక్తి ప్రాపర్టీని అమ్మినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త బీటౌన్ లో చక్కర్లు కొట్టడంతో చాలామంది షాక్ అవుతున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్లేనా..?
అయితే అంత పెద్ద హీరో అయి ఉండి ఈయనకి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. ఇక చాలా రోజుల నుండి అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ బాలీవుడ్ లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడంతో అక్షయ్ కుమార్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని,అందుకే తనకి సంబంధించిన ఖరీదైన ప్రాపర్టీని అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇక ముంబై (Mumbai) 360 వెస్ట్ టవర్లో అక్షయ్ కుమార్ కి 6,830 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఇక ఈ అపార్ట్మెంట్లో నాలుగు కార్లు పార్కింగ్ చేసే ప్లేస్ కూడా ఉంది.ఇక అంత ఖరీదైన విశాలమైన అపార్ట్మెంట్ ని అక్షయ్ కుమార్ అమ్మడంతో ప్రస్తుతం బీటౌన్ మొత్తం దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇక అక్షయ్ కుమార్ ఈ ప్రాపర్టీని జనవరి 31 నే అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇక అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినప్పటికీ ఆయనకు వరుస సినిమాల్లో అవకాశాలు రావడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈయన చేసిన ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయినా కూడా వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. అయితే అక్షయ్ కుమార్(Akshay Kumar) అపార్ట్మెంట్ అమ్మిన వార్త బీటౌన్ లో వైరల్ అవ్వడంతో చాలామంది ఆయన ఆర్థిక పరిస్థితుల వల్లే ఆ ఫ్లాట్ ని అమ్మేసారని కామెంట్స్ చేస్తున్నారు.