Nani:సినిమాకు బడ్జెట్ పెట్టే ఏ నిర్మాత అయినా సరే ఆ హీరోకి మార్కెట్లో ఎంత రేంజ్ ఉంది..? ఎంత బడ్జెట్ పెడితే బాగుంటుంది.. ? ఆ హీరో పై పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా? లేదా అని ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. కానీ ఈ హీరోకి పెట్టే బడ్జెట్ విషయంలో నిర్మాతలు నో కాంప్రమైజ్ అంటున్నారట. ఈ హీరో సినిమాకి డబ్బులు ఎన్ని కోట్లు అయినా సరే కుమ్మరిస్తాం అంటున్నారట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. నేచురల్ స్టార్ నాని (Nani).. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది నిర్మాతలు బడ్జెట్ ఎక్కువైతే భయపడిపోతున్నారు. సినిమా తేడా కొడితే ఎలా.. ? పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందా? లేదా? అని భయపడుతున్నారు. కానీ నాని విషయంలో మాత్రం నిర్మాతలు తగ్గేదేలే అన్నట్లు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎందుకంటే నాని మీద వారికి అంత నమ్మకం ఉంది.
నాని కోసం ఎగబడుతున్న నిర్మాతలు..
ఇక అసలు విషయం ఏమిటంటే.. నాని(Nani) హీరోగా చేసిన సినిమాలన్నీ ఈమధ్య వరుసగా హిట్ అవుతున్నాయి. అలా దసరా(Dasara),హాయ్ నాన్న , సరిపోదా శనివారం (Saripoda Sanivaaram) వంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చెప్పనక్కర్లేదు. ఇక కొంతమంది హీరోల సినిమాలు రెండు హిట్ అయితే ఒకటి ఫ్లాప్ అవుతుంది. కానీ ఈ హీరో సినిమాలు మాత్రం వరుసగా హిట్స్ అవుతున్నాయి. అంతేకాదు సినిమా సినిమాకి నాని రేంజ్ పెరుగుతోంది. బడ్జెట్ కూడా పెరుగుతోంది.అలా నాని నటించిన ఒక్కో సినిమా ఒక్కో రికార్డు క్రియేట్ చేస్తోంది. దాంతో నిర్మాతలు నానిని పూర్తిగా నమ్మేశారు. కోటి రూపాయలు పెట్టే దగ్గర రూ.2కోట్లు పెట్టడానికైనా సిద్ధమవుతున్నారు. అలా తాజాగా నాని హీరోగా చేస్తున్న సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనకాడటం లేదు. ఇక హీరో నాని చేతిలో హిట్ -3(Hit-3) తో పాటు ప్యారడైజ్ సినిమా కూడా ఉంది.
నాని సినిమాలు..
అయితే ఈ రెండు సినిమాల తర్వాత సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో నాని ఓ సినిమా చేయబోతున్నారు. ఇక సొంత బ్యానర్ లో నాని నటిస్తున్న హిట్ 3కి ఏకంగా రూ.70 కోట్లు బడ్జెట్ పెడుతున్నారట. అలాగే దసరా తో భారీ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా అనౌన్స్ చేశారు నాని. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గానే పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ సినిమాకి ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనకాడడం లేదట. అలాగే ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాకి కూడా భారీగానే బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అలా నాని (Nani) సినిమాకు బడ్జెట్ పెట్టే విషయంలో నిర్మాతలు అస్సలు తగ్గట్లేదని బడ్జెట్ విషయంలో నో లిమిట్ అంటున్నారట.అయితే ఈ విషయం బాగానే ఉన్నప్పటికీ తేడా కొడితే మాత్రం నిర్మాతలు ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్. మరి నాని కెరియర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.