Death Threat to Salman Khan..బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కు మరొకసారి హత్యా బెదిరింపులు మొదలయ్యాయి. ఈయన కారును బాంబుతో పేల్చేస్తామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారట. సల్మాన్..” నిన్ను ఇంట్లోనే చంపుతాం లేదంటే నీ కారును బాంబు పెట్టి పేల్చేస్తామని” ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఈ నంబర్ ముంబై – వర్లి లోని రవాణా శాఖ పేరు మీద ఉండడం గమనార్హం. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇక త్వరలోనే పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఇకపోతే ఎప్పుడో చేసిన తప్పిదానికి ఇన్నేళ్లయినా కూడా ఇంకా ఆ తప్పు సల్మాన్ ఖాన్ ను వెంటాడుతోందని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా హుందాగా వెళ్లలేకపోతున్నారు. వేలకోట్ల ఆస్తులు ఉన్నా సరే సమస్య నుండి బయటపడలేకపోతున్నారు. కనీసం ఇప్పటికైనా ఈ హత్య బెదిరింపుల నుండి విముక్తి కలగాలని అభిమానులు కోరుతూ ఉండడం గమనార్హం. ఇక సల్మాన్ ఖాన్ కి హత్యా బెదిరింపులు రావడం ఇదేమి తొలిసారి కాదు. ఇప్పటికే చాలాసార్లు ఆయనను చంపేస్తామని బెదిరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కారులో బాంబు పెట్టి పేలుస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం.
సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
బాలీవుడ్ నటుడు సల్మాన్ కారును బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు
ముంబై-వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి ఓ ఆగంతకుడి కాల్
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది pic.twitter.com/RXsH73wb7c
— BIG TV Breaking News (@bigtvtelugu) April 14, 2025
ఆయుష్షు ఉన్నంత కాలం బ్రతుకుతాను – సల్మాన్ ఖాన్
గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కు పలు మార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై ఎప్పుడూ స్పందించని సల్మాన్ఖాన్ తొలిసారి ‘ సికందర్’ సినిమా ప్రమోషన్స్ లో స్పందించారు కూడా.. దానిపై మాట్లాడుతూ.. ” నేను దేవుడిని నమ్ముతాను. అన్నీ అల్లానే చూసుకుంటాడు. అలాగే ఆయుష్షు ఉన్నంతకాలం జీవిస్తాను” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఇక బెదిరింపుల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు ఆ భద్రత కూడా సవాలుగా అనిపిస్తుంది. అంటూ కూడా సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఇక సల్మాన్ ఖాన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
హత్యా బెదిరింపుల వెనుక అసలు నిజం ఏంటంటే..?
అయితే గత కొన్ని దశాబ్దాలుగా సల్మాన్ ఖాన్ ఇలా హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.అయితే ఇలా బెదిరింపులు వెనుక ఉన్న అసలు నిజం ఏంటంటే.. 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను చంపాడని, ఆయనను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఇక ఈ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ ఎన్నోసార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు.. గత ఏడాది ఏప్రిల్ లో ముంబైలో ఆయన నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పులు కూడా జరిపారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఏకంగా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు నిలబడి కాల్పులు జరిపి మరీ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలోనే మరొకసారి సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరిగింది. ఇలా వరుస హత్య బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ కు Y+ భద్రత సమకూర్చారు. అలాగే ముంబైలో ఆయన నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కి కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మళ్లీ ఈ హత్య బెదిరింపులు అభిమానులను కలవర పాటకు గురి చేస్తున్నాయి.