Bollywood Stars : సెలబ్రిటీలను దగ్గరగా చూడడం అంటే అందరికీ ఇష్టమే. తెరపై ఆడి పాడి ఎమోషన్ తో కట్టి పడేసే మన అభిమాన నటీనటులు రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో మన కళ్ళముందే స్టేప్పేసి అదరగొడితే అద్భుతంగా ఉంటుంది కదా.. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఇదే విధంగా పలువురు ప్రముఖుల పెళ్ళిళ్ళలో పర్ఫామ్ చేసి, తమకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటారు.
సౌత్ లో అయితే ఇలాంటిదేమీ ఉండదు. డై హార్డ్ ఫ్యాన్స్ మీద అభిమానంతో అప్పుడప్పుడూ తారలు తమ ఫ్యాన్స్ పెళ్ళిళ్ళల్లో మెరుస్తారు. కానీ డబ్బులు తీసుకుని పర్ఫామ్ చేయడం అనే ట్రెండ్ ఇంకా మన దగ్గర స్టార్ట్ అవ్వలేదు. అయితే బాలీవుడ్ లో ఇది ఇప్పటికే జోరుగా నడుస్తోంది. బాలీవుడ్ తారలు వివాహాలకు హాజరవడం, అతిథుల ముందు ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఆయా ప్రముఖుల పెళ్ళిళ్ళను స్పెషల్ అట్రాక్షన్ గా మారుస్తారు. ఇటీవల జరిగిన అంబానీ వివాహ వైభవం నుండి ఏదైనా VIP వేడుక వరకు, బాలీవుడ్ తారలు తమ ప్రదర్శనలతో మెరుపులను జోడించడానికి క్రమం తప్పకుండా ఆహ్వానం అందుకుంటారు. ఈ తారలను ఆహ్వానించడం చిన్న విషయం కాదు, ఎందుకంటే వారు వేదికను తమ గ్లామర్ తో వెలిగించడానికి భారీగా వసూలు చేస్తారు. బాలీవుడ్ అగ్ర తారలు, ఇలా పర్ఫామ్ చేయడానికి వారు ఎంత వసూలు చేస్తారు అనే విషయాలు తెలుసుకుందాం పదండి.
బాలీవుడ్ స్టార్స్, వారి ఈవెంట్ డ్యాన్స్ ఫీజు
1. షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)
బాలీవుడ్ కింగ్ దాదాపు తన టైమ్‌లెస్ చార్మ్, చరిష్మాతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రైవేట్ ఈవెంట్‌లకు తీసుకురావడానికి 3 కోట్లు తీసుకుంటారు.
2. కత్రినా కైఫ్ (Katrina Kaif)
హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌కు పేరుగాంచిన కత్రినా కైఫ్ ఈ జాబితాలో అత్యధిక పారితోషికం పొందే తార. ఒక ప్రైవేట్ డ్యాన్స్ ప్రదర్శన కోసం ఆమె ఏకంగా రూ.3.5 కోట్లు వసూల్ చేస్తుంది.
3. అక్షయ్ కుమార్ (Akshay Kumar)
స్టేజ్ పై ప్రైవేట్ ఈవెంట్లలో ప్రదర్శన ఇవ్వడానికి అక్షయ్ కుమార్ రూ. 2.5 కోట్లు తీసుకుంటారు.
4. హృతిక్ రోషన్ (Hrithik Roshan)
బాలీవుడ్ ఫేవరెట్ డ్యాన్సర్ హృతిక్ రోషన్ ఫీజు ఏదైనా ఈవెంట్‌లో తన డ్యాన్స్ స్కిల్స్‌తో అతిథులను ఆశ్చర్యపరిచేందుకు రూ. 2.5 కోట్లు.
5. రణబీర్ కపూర్ (Ranabir Kapoor)
ఆకర్షణీయమైన రణబీర్ కపూర్ ఈవెంట్‌లకు రూ. 2 కోట్లు అందుకుంటారు.
6. సల్మాన్ ఖాన్ (Salmaan Khan)
సల్మాన్ ఖాన్ ప్రైవేట్ పార్టీలు, ఈవెంట్లలో ప్రదర్శన ఇవ్వడానికి రూ. 2 కోట్లు వసూలు చేస్తారు.
7. అలియా భట్ (Alia Bhatt)
బాలీవుడ్ దివా అలియా భట్ ఫీజు ప్రైవేట్ ఈవెంట్ ప్రదర్శనల కోసం రూ.1.5 కోట్లు.
8. దీపికా పదుకొనే (Deepika Padukone)
ప్రైవేట్ ఈవెంట్ల కోసం ఎక్కువగా కోరుకునే తారలలో దీపికా కూడా ఒకరు. ఆమె స్పెషల్ డ్యాన్స్ తో స్టేజ్ దద్దరిల్లాలంటే రూ. 1 కోటి చెల్లించాల్సిందే.
9. రణవీర్ సింగ్ (Ranveer Singh)
రణవీర్ సింగ్ రూ. 1 తీసుకుని స్టేజ్ ను ఎనర్జిటిక్ గా మారుస్తారు.
10. విక్కీ కౌశల్ (Vicky Kaushal)
టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ కూడా ప్రైవేట్ ఈవెంట్ల కోసం రూ.1 అందుకుంటారు.