BigTV English

Shah Rukh Khan: అరుదైన అవార్డును అందుకోనున్న బాలీవుడ్ బాద్షా..

Shah Rukh Khan: అరుదైన అవార్డును అందుకోనున్న బాలీవుడ్ బాద్షా..

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 77వ ఎడిషన్‌లో షారుఖ్ ఖాన్‌కు ఫెస్టివల్ కెరీర్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకోనున్నాడు. ఈ విషయాన్ని లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ యాజమాన్యం అధికారికంగా తెలిపింది. భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నందుకు ఈ అవార్డును అందించనున్నట్లు వారు తెలిపారు.


77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారత సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను పార్డో అల్లా కారియరా అవార్డుతో సత్కరించనున్నారు. ఈ ఉత్సవం ఆగస్టు 7న మొదలై.. ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది. ఆగస్ట్ 10, శనివారం సాయంత్రం పియాజ్జా గ్రాండేలో షారుఖ్ ఈ అవార్డును అందుకోనున్నాడు. అంతేకాకుండా ఖాన్ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచిన దేవదాస్ సినిమాను ఆ వేడుకలో ప్రదర్శించనున్నారు.

ఇక హాలీవుడ్ నటులు అయిన ఫ్రాన్సిస్కో రోసీ, క్లాడ్ గోరెట్టా, బ్రూనో గంజ్, క్లాడియా కార్డినాల్, జానీ టో, హ్యారీ బెలాఫోంటే, పీటర్-క్రిస్టియన్ ఫ్యూటర్, సెర్గియో కాస్టెల్లిట్టో, విక్టర్ ఎరిస్, మార్లెన్ ఖుత్సీవ్, జారిన్ బి అడ్గిర్ఫ్, జానె బి అడ్గిర్ఫ్ లాంటివారు ఈ అవార్డును అందుకున్నారు. మొట్ట మొదటిసారి ఈ ఏడాది ఒక భారతీయ నటుడు ఈ అవార్డును అందుకోనున్నాడు. దీంతో షారుఖ్ అభిమానులు.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


పఠాన్ సినిమాతో పడిపోతున్న బాలీవుడ్ ఇండస్ట్రీని పైకి లేపాడు షారుఖ్. ఈ సినిమా తరువాత జవాన్ తో మరో హిట్ ను అందుకున్నాడు. ఇక జవాన్ తో తెలుగు, తమి ప్రేక్షకులను కూడా మెప్పించాడు. ఆ తరువాత డుంకీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×