Boney Kapoor:దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దాదాపు అన్ని భాషల్లో నటించి భారీ సక్సెస్ అందుకుంది. అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈమె.. ఎన్టీఆర్ (NTR)మొదలుకొని చిరంజీవి(Chiranjeevi ), వెంకటేష్ (Venkatesh) వంటి హీరోలకు జోడీగా కూడా నటించి అబ్బురపరిచింది. ఇకపోతే ఇప్పుడు ఈమె మన మధ్య లేకపోయినా.. ఈమె వారసత్వంగా ఈమె ఇద్దరు కూతుర్లు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ (Khushi Kapoor) సినిమాలు చేస్తూ తల్లి స్థానాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. గత ఏడాది ఎన్టీఆర్ (Jr.NTR) సరసన ‘దేవరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) సరసన హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ విషయానికి వస్తే.. ఈమె ఇటీవలే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. ఇప్పటికే ‘ఆర్చీస్’, ‘లవ్ యాపా’ వంటి సినిమాలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపును కూడా అందుకుంది..
త్వరలో శ్రీదేవి చివరి చిత్రం సీక్వెల్..
ఇక ఇప్పుడు తన తల్లి శ్రీదేవి చివరిసారిగా తెరపై కనిపించిన చిత్రం సీక్వెల్ లో నటించడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ (Boney Kapoor) స్వయంగా వెల్లడించారు. ఐఫా వేడుకలలో భాగంగా అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. “శ్రీదేవి నటించిన చివరి చిత్రం ‘మామ్’. ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాము. ఖుషి ఇప్పటివరకు చేసిన సినిమాలు నేను చూశాను. ఆమె చాలా అద్భుతంగా నటించింది. ఆమెతోనే త్వరలో నేను సినిమా చేస్తాను .అది ‘మామ్ 2’ కావచ్చు” అంటూ బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే తల్లి పాత్రలో కూతురే నటించబోతోంది అని తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ విషయాన్ని బోనీకపూర్ వెల్లడించడంతో త్వరలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చిన్న కూతురే మొదటి ఎంపిక అంటున్న బోనీకపూర్..
ఇక మామ్ చిత్రమ్ విషయాకొస్తే శ్రీదేవి చివరిసారిగా నటించిన చిత్రం ఇది. రవి ఉద్యావర్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ సినిమాకి బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరించారు. హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన మామ్ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా మామ్ 2 ని తెరకెక్కిస్తున్నామని, అందులోనూ శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ లీడ్ రోల్లో నటిస్తుందని బోనీకపూర్ చెప్పడంతో నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. ఇక శ్రీదేవి విషయానికి వస్తే.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ఆరంభించిన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్ , అనే భాషతో సంబంధం లేకుండా ప్రతి భాష ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కమలహాసన్ వంటి దిగ్గజ నటులతో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇక వరుస అవకాశాలు అందుకుంటూనే బాలీవుడ్కు వెళ్లిపోయిన ఈమె అక్కడ కూడా పలు చిత్రాలతో ఊహించని క్రేజ్ దక్కించుకుంది. అయితే అనుకోకుండా ఒక వివాహానికి వెళ్లిన ఈమె.. దుబాయ్ లో బాత్రూంలో బాత్ టబ్ లో పడి మరణించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే శ్రీదేవి మరణం వెనుక ఉన్న అసలు కారణం ఇప్పటికీ బయటపడకపోవడం ఆశ్చర్యకరం.