TTD Employee Theft: కలియుగ వేంకటేశ్వరుడుని వివాదాలు వీడటం లేదు. కల్తీ నెయ్యితో మొదలైన వివాదాలు ఇప్పుడు హుండీ లెక్కింపు వరకు వచ్చింది. ఈసారి తిరుమల ఆలయంలో కాకుండా చెన్నైలో శ్రీవారి ఆలయంలో ఊహించని ఘటన జరిగింది. భక్తులు వెంకన్నకు ఇచ్చిన నగదు కానుకల్లో టీటీడీకి చెందిన ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు.ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో అతడ్ని సస్పెండ్ చేశారు ఈవో.
టీటీడీ ఆలయంలో విదేశీ కరెన్సీ ఇష్యూ
టీటీడీకి చెందిన ఆలయ పరకామణి లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయి. భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో ఉద్యోగి కృష్ణకుమార్ చేతివాటం ప్రదర్శించారు. ఫారెన్ కరెన్సీని ఆయన దారి మళ్లించాడు. కరెన్సీ లెక్కింపులో తేడా ఉన్నట్లు గుర్తించారు అధికారులు.
ఉద్యోగిపై వేటు పడింది
చివరకు సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కృష్ణకుమార్ అవకతవకలకు పాల్పడినట్లు టీడీడీ విజిలెన్స్ విభాగం నిర్ధారించింది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావుకు నివేదిక సమర్పించింది. నివేదిక ఆధారంగా కృష్ణకుమార్‌ను ఈవో సస్పెండ్ చేయడం, దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అసలేం జరిగింది?
చెన్నైలో టీటీడీ శ్రీవారి ఆలయం ఉంది. హుండీ లెక్కింపు వ్యవహారాలను అక్కడి సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ చూస్తుంటారు. అయితే విదేశీ కరెన్సీని ఆయన స్వాహా చేశాడు. గతేడాది ఒక నెలలో దాదాపు రూ.6 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ALSO READ: ఆయనే ఏపీకి కాబోయే అధ్యక్షుడు, ఎవరాయన?
పద్దతి ప్రకారం.. హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని ప్రతి నెల ఒకటిన తిరుమల పరకామణిలో జమ చేయాల్సి ఉంటుంది. ఆయన చెబుతున్నదానికి, లెక్కలకు చాలా తేడా వచ్చింది. విదేశీ కరెన్సీపై టీటీడీ విజిలెన్స్ విచారణ చేపట్టింది. సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ కరెన్సీని స్వాహా చేసినట్టు గుర్తించింది. చివరకు వేటు వేసింది.
గతంలో ఇలాంటి ఆరోపణలు
ఇప్పుడే కాదు గతంలో పరకామణి వ్యవహారంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించిన సందర్భాలు లేకపోలేదు. కరోనా సమయంలో ఇలాంటిది ఒకటి జరిగింది. 2020-23 మధ్యకాలంలో శ్రీవారికి వచ్చిన విదేశీ కరెన్సీని నొక్కేశాడట అందులోని ఓ ఉద్యోగి. హండీకి వచ్చిన డాలర్లను మూడో కంటికి తెలీకుండా దొంగలించాడు. సిబ్బంది పలుమార్లు తనిఖీలు చేసినా దొరికేవాడు కాడట.
దొంగిలించిన డబ్బుతో బయట ఆస్తులను కూడగట్టాడు. చివరకు విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో డాలర్ల లోగుట్టు బయటపడింది. విజిలెన్స్‌లో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు.
విదేశీ కరెన్సీ లొల్లి, పరిష్కారమేది?
ఇప్పటివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. కొందరు టీటీడీ అధికారులు పోలీసులతో కుమ్మక్కై డీల్ సెట్ చే సుకున్నారనే వాదన సైతం లేకపోలేదు. ఆ వ్యక్తి దొంగలించిన ఆస్తుల్లో 70 లేదా 80 కోట్ల రూపాయలను టీటీడీకి విరాళం ఇచ్చినట్టు చేశారు అప్పటి పెద్దలు. ఈ వ్యవహారంపై వివాదంపై కొనసాగుతుండగా, చెన్నై శ్రీవారి ఆలయం వ్యవహారం బయటపడింది. ఏ మాత్రం ఉపేక్షించకుండా వెంటనే వేటు వేశారు ఈవో.