BigTV English

Boney Kapoor on Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్.. నేను బతికి ఉండగా జరగదు: బోనీ కపూర్

Boney Kapoor on Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్.. నేను బతికి ఉండగా జరగదు: బోనీ కపూర్
Sridevi and Boney Kapoor
Sridevi and Boney Kapoor

Boney Kapoor Comments on Sridevi Biopic: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం, అభినయం ఏ హీరోయిన్ కు రాదు. శ్రీదేవి అంటే శ్రీదేవినే. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి అన్ని భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక నిర్మాత బోనీ కపూర్ ను వివాహమాడి ఇండస్ట్రీకి దూరమయ్యింది.


ఇక 2018 లో ఆమె బాత్ రూమ్ లో కాలుజారి కిందపడి మరణించింది. శ్రీదేవి మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె చనిపోయిన తరువాత శ్రీదేవి బయోపిక్ తీయడానికి ఎంతోమంది ప్రయత్నించారు. కానీ, అది జరగలేదు. ప్రస్తుతం బోనీ కపూర్ నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇంకోపక్క ఇద్దరు కూతుర్లు జాన్వీ, ఖుషిల లైఫ్ సెట్ చేసే పనిలో పడ్డాడు. ఈ మధ్యనే ఒక ప్రెస్ మీట్ లో జాన్వీ బాయ్ ఫ్రెండ్ అంటే తనకు కూడా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీకి శ్రీదేవి బయోపిక్ పై ప్రశ్న ఎదురైంది. శ్రీదేవి బయోపిక్ వస్తుందని వార్తలు వస్తున్నాయి.. దానిపై మీ స్పందన అన్న ప్రశ్నకు బోనీ మాట్లాడుతూ.. ” నేను బతికి ఉండగా శ్రీదేవి బయోపిక్ రాదు. అందుకు నేను అనుమతించాను. శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. తనకు సంబంధించిన విషయాలు బయటికి రాకూడదు అనుకుంటుంది.


Also Read: Devara: ‘దేవర’ ట్రీట్ అదిరింది బాసు.. కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా..!

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె గురించి వచ్చే ఏ విషయాలు నిజం కాదు. ఆమె జీవితం ఎప్పుడు ప్రైవేట్ గానే ఉండాలి. నేను ఉంచుతాను. అది నేను ఉన్నంతవరకు చేయగలను. నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్ కు అనుమతి ఇవ్వను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×