Big Stories

Stephen Raveendra: ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు.. డీఎస్పీ గంగాధర్ సంచలన ఆరోపణలు!

Stephen Raveendra latest news
Stephen Raveendra

DSP Complaint on IG Stephen Raveendra(Telangana today news): తెలంగాణ హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్ రెడ్డికి కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. ఓ భూ వివాదంలో తాను తలదూర్చానంటూ.. ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే సస్పెండ్ చేశారాని ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జాదారులతో చేయి కలిపి తనను అకారణంగా విధుల నుంచి తొలగించారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

- Advertisement -

భూ వివాదంలో అప్పటి జిల్లా కలెక్టర్‌, పోలీస్ క‌మీషనర్‌ ఆదేశాలతోనే తాను కేసు నమోదు చేశానని గంగాధర్ చెప్పారు. కానీ ల్యాండ్ గ్రాబర్స్‌పై కేసు ఎందుకు పెట్టావని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారని తన ఫిర్యాదులో తెలిపారు. శంకర్‌పల్లి మండలం జన్వాడ, కొల్లూరు గ్రామాల మధ్య ఓవర్‌ లాప్‌ భూ వివాదం విషయంలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు.

- Advertisement -

సస్పెండ్ అయిన అధికారులపై 3 నుంచి 6 నెలలలోపు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలనే  జీవో ఉందని గంగాధర్ గుర్తు చేశారు. కానీ.. ఏడాదిన్నరపాటు కేసును స్టీఫెన్ రవీందర్ పక్కన పెట్టడంతో ప్రమోషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు.

Also Read: పోలీస్ కస్టడీకి రాధాకిషన్.. చంచల్ గూడ జైలు నుంచి ఉస్మానియాకు..

తన బ్యాచ్ ఇన్ స్పెక్టర్లు డీఎస్పీలుగా ప్రమోషన్ పొందితే.. తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదుగుదల లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన బ్యాచ్ వారి కంటే చాలా ఆలస్యంగా ప్రమోషన్ వచ్చిందని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News