BigTV English

Boney Kapoor: తొలిసారి శ్రీదేవి మరణం పై నోరు విప్పిన నిర్మాత.. అదే ప్రాణం తీసింది అంటూ..?

Boney Kapoor: తొలిసారి శ్రీదేవి మరణం పై నోరు విప్పిన నిర్మాత.. అదే ప్రాణం తీసింది అంటూ..?

Boney Kapoor: ప్రముఖ దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi ) తన అందచందాలతో యావత్ భారత దేశ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ముఖ్యంగా అందాల సుందరిగా,అతిలోక దేవతగా పేరు దక్కించుకుంది. ఎంత అందం ఉన్నా.. చిన్న వయసులోనే మరణించడం ఆమె అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. శ్రీదేవి మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ఈమె మరణం ఎలా సంభవించింది అంటే..? మాత్రం, ఆమె బాత్ టబ్ లో పడి చనిపోయింది కదా! అందరికీ తెలిసిందే కదా! అంటారు. కానీ దీనికంటే బలమైన కారణం ఒకటి ఉంది అని, శ్రీదేవి మరణించిన చాలా ఏళ్ల తర్వాత ఆమె భర్త బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్(Boney Kapoor) నోరు విప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


2018లో దుబాయ్ లో మరణించిన శ్రీదేవి.

భారతీయ సినీ పరిశ్రమలో మొదటి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. దేశంలోని ప్రముఖ నటులతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె, తన నటనతో కోట్లాదిమంది అభిమానులను కలిగి ఉంది..ఇకపోతే శ్రీదేవి దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి 2018 ఫిబ్రవరి 24వ తేదీన ఆమె స్టే చేసిన హోటల్ లోని బాత్ టబ్ లో పడి మరణించింది. కానీ ఈమె మరణం పై ఇప్పటికీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోణీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన భార్య మరణం.. విషాదం అంటూ తెలిపారు.


ఆ బలమైన కోరికే ఆమె ప్రాణాలు తీసింది..

బోణీ కపూర్ మాట్లాడుతూ..”శ్రీదేవి ఎప్పుడూ కూడా తన రూపం గురించే ఎక్కువ శ్రద్ధ వహించేది. ఆమె ఆన్ స్క్రీన్ పాత్రల కోసం ఒక నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉండాలని అనుకుంటు ఉండేది. అందంగా కనిపించడానికి తరచూ ఎన్నో కఠినమైన చర్యలు కూడా తీసుకునేది. ఆ కఠినమైన నియమాలకు మేము కూడా ఆశ్చర్యపోయే వాళ్ళం. ముఖ్యంగా తరచుగా క్రాష్ డైట్ లను పాటించేది. అంతేకాదు తాను అనుకున్న రూపాన్ని పొందడానికి తిండి కూడా తినేది కాదు. అందంగా ఉండాలనే కోరిక అందరిలో ఆందోళన కలిగించేది. కొన్నిసార్లు ఆమె ఆరోగ్యాన్ని కూడా అది ప్రభావితం చేసింది. అయినా సరే శ్రీదేవి తన రూపాన్ని పొందడం కోసం ప్రయత్నాలు విరమించేది కాదు. నాతో పెళ్లి అయినప్పటి నుంచి శ్రీదేవికి ‘లో బీపీ సమస్య’ ఉండేది. కఠినమైన ఆహార నియమాల కారణంగానే ఇలా ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేసుకుంది. ఎప్పుడూ తాను తినే కూరల్లో ఉప్పు లేకుండా చూసుకునేది. దీనికి తోడు బయట హోటల్లో తింటే రాత్రి భోజనంలో ఉప్పు లేకుండా ఆహారం తీసుకునేది అదే ఆరోగ్యానికి కీడుగా మారింది.. అందం కోసం ఆమె ప్రాకులాడడం వల్లే ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చి మరణించింది” అంటూ బోణీ కపూర్ కామెంట్లు చేశారు.

ఫ్యాన్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న శ్రీదేవి..

మొత్తానికైతే శ్రీదేవి మరణం పై బోణీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అభిమానులు ఒకసారి ఒక రూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరాధించారు అంటే, ఎప్పటికీ అదే రూపం కోరుకుంటారు అని సెలబ్రిటీలు కొంతమంది భావిస్తారు. అలాంటి వారిలో శ్రీదేవి కూడా ఒకరు. అందుకే అభిమానులను మెప్పించడం కోసం తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది శ్రీదేవి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×