BigTV English

V.n Adithya: ఆ టాప్ డైరెక్టర్స్ అంతా కూడా ఒకప్పుడు విఎన్ ఆదిత్య దగ్గర పనిచేసిన వాళ్ళే

V.n Adithya: ఆ టాప్ డైరెక్టర్స్ అంతా కూడా ఒకప్పుడు విఎన్ ఆదిత్య దగ్గర పనిచేసిన వాళ్ళే

V.n Adithya: ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించేశారు కానీ ఒకప్పుడు వి ఎన్ ఆదిత్య అంటే మంచి పేరు ఉన్న దర్శకులు. ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తాయి. ఆయన సినిమాల్లో ముఖ్యంగా మనసంతా నువ్వే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమాలో ఉదయ్ కిరణ్ చాలా మందికి విపరీతంగా నచ్చేసాడు. ఆ సినిమా కథను విఎన్ ఆదిత్య రాసిన విధానం కూడా చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ లవ్ స్టోరీస్ ప్రస్తావన వస్తే ఆ సినిమా గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. నాగార్జున హీరోగా చేసిన నేనున్నాను సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ దర్శకుడు దగ్గర చాలామంది సహాయ దర్శకులుగా పనిచేశారు. వారిలో ఇప్పుడు కొందరు టాప్ డైరెక్టర్స్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు.


అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్- ఇప్పుడు టాప్ డైరెక్టర్స్

సందీప్ రెడ్డి వంగ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సందీప్ ప్రస్తావన వచ్చినప్పుడు కేడి అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను అని ఎక్కువ శాతం ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చాడు. ఆస్ట్రేలియాలో చదువుకున్న తర్వాత సందీప్ రెడ్డి కేడి సినిమాకి వర్క్ చేశాడు. అంతకంటే ముందు వి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన “మనసు మాట వినదు సినిమా” కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు సందీప్ రెడ్డి వంగ. అయితే అప్పట్లోనే నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్వాణ సందీప్ రెడ్డి వంగకి పరిచయం అయ్యాడు. సందీప్ ఆ సినిమా చేసిన తర్వాత ఫిలిమ్స్ కోర్స్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఇక ప్రస్తుతం శివ నిర్వాణ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ దర్శకుడుగా పేరు సాధించుకున్నాడు. పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన అనిల్ రావిపూడి కూడా ఒకప్పుడు విఎన్ ఆదిత్య దగ్గర శిష్యరికం చేశాడు. బాస్ సినిమాలో రైటింగ్ కూడా అనిల్ రావిపూడి హెల్ప్ చేశాడు.


అంకిత గుర్తు చేసింది

రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ అమెరికా వెళ్ళినప్పుడు, అక్కడ మనసు మాట వినదు హీరోయిన్ అంకిత కలిసిందట. అయితే అంకిత వచ్చి సందీప్ రెడ్డి వంగతో ఫోటో దిగింది. ఫోటో దిగిన టైం లో నేను ఆ సినిమాకి పని చేసినప్పుడు విఎన్ ఆదిత్య గారు మీ డ్రెస్ విషయంలో ఏదైనా ఉంటే నన్ను పంపించి చెప్పమనేవారు అని సందీప్ రెడ్డివంగా గుర్తు చేశారట. ఇదే విషయాన్ని అంకిత కొన్ని రోజుల క్రితం విఎన్ ఆదిత్య కు మెసేజ్ చేసి ఈ విషయాన్ని గుర్తు చేశారు అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలాంటి సక్సెస్ సాధిస్తారు అని ఎవరు అంచనా వేయలేరు.

Also Read : fauji imanvi : పాకిస్తానీ కాదు అని అబద్ధం చెప్పిన ప్రభాస్ బ్యూటీ, పాత పోస్ట్ వైరల్

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×