Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కు ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది. మూడేళ్ళుగా ఊరిస్తూ వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ అయ్యింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ, అంజలి హీరో హీరోయిన్లుగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఎప్పుడెప్పుడు గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూసారు. ఆ ఎదురుచూపులకు నేడు ఫుల్ స్టాప్ పడింది.
అయితే అనుకున్నది ఒక్కటి అయ్యినది ఒక్కటి అన్నట్లు.. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. కొంతమంది సినిమా బావుంది అంటుంటే.. ఇంకొంతమంది వరస్ట్ గా ఉందని చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది పుష్ప 2 తో పోలుస్తూ అసలు ఇదేం సినిమా అని పెదవి విరుస్తున్నారు. ఇక సినిమాలో చరణ్ మూడు పాత్రల్లో నటించగా.. అప్పన్న పాత్రకు మంచి మార్కులు పడ్డాయని అంటున్నారు. కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పుకొస్తున్నారు.
Balagam Venu: ఆ విషయంలో రాంగ్ స్టెప్ తీసుకున్నా.. బలగం డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
ఇంకొంతమంది.. ఇలాంటి సినిమాలను ఇప్పుడెవరు చూడడం లేదని. పొలిటికల్ డ్రామా కావడంతో ఎవరికి ఎక్కలేదని అంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్.. బ్లాక్ బస్టర్ అని ఒకపక్క.. డిజాస్టర్ అని ఇంకోపక్క ట్రెండింగ్ అవుతుంది. వీటినేమి పట్టించుకోకుండా ఫ్యాన్స్ మాత్రం సినిమాకు క్యూ కడుతున్నారు.
ఇక తాజాగా గేమ్ ఛేంజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మెగా ఫ్యామిలీ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఉపాసన, సాయి ధరమ్ తేజ్ లాంటి వారి సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో గేమ్ ఛేంజర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు.
” అప్పన్న,నీతిమంతుడు మరియు వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే పట్టుదలతో ఉన్న ఐఏఎస్ అధికారి రామ్ నందన్ గా రామ్ చరణ్ చాలా బాగా నటించాడని ప్రశంసలు అందుకున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ సినిమాలో నటించిన ఎస్ జె సూర్య, అంజలి, కియారా అద్వానీ, నిర్మాత దిల్ రాజు అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్.. ఒక మంచి పొలిటికల్ డ్రామాకు ఎలాంటి నటులను తీసుకోవాలో అలాంటివారిని తీసుకొని గేమ్ ఛేంజర్ ను అందించారు. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Delighted to see lots of appreciation for @AlwaysRamCharan who excels as Appanna ,the righteous ideologue &
Ram Nandan, the determined IAS officer out to cleanse the system.Hearty Congrats to @iam_SJSuryah @advani_kiara @yoursanjali ,
Producer #DilRaju @SVC_Official ,
above…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 10, 2025