BigTV English

BRO Movie Review : మామా అల్లుళ్లు మెప్పించారా..? బ్రో మూవీ ఎలా ఉందంటే..?

BRO Movie Review : మామా అల్లుళ్లు మెప్పించారా..? బ్రో మూవీ ఎలా ఉందంటే..?
BRO Movie Review Telugu

BRO Movie Review Telugu(Today tollywood news) :

పవన్‌ కల్యాణ్‌, తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ తో కలిసి నటించిన సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘వినోదయసిత్తం’ తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాను ‘బ్రో’ గా తెలుగులోకి రీమేక్‌ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాయడంతో అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఈ విషయాలు తెలుసుకుందాం.


క‌థ : మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధ‌ర‌మ్ తేజ్) ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత కుటుంబ బాధ్యత తీసుకుంటాడు. ఇద్ద‌రు చెల్లెళ్లు, త‌మ్ముడు భవిష్యత్తు కోసం కష్టపడతాడు. ఓ రోజు ఊహించ‌ని రీతిలో ఓ రోడ్డు ప్ర‌మాదం అతడిని క‌బ‌ళిస్తుంది. త‌న జీవితానికి ఇంత తొంద‌ర‌గా ముగింపునివ్వ‌డం అన్యాయమని కాలం (ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌) అనే దేవుడిని వేడుకుంటాడు. దీంతో ఆ దేవుడు అనుగ్ర‌హించి 90 రోజులపాటు జీవిత‌ కాలాన్ని పెంచుతాడు. తిరిగి ఇంటికి చేరిన మార్క్ 90 రోజుల్లో లక్ష్యాన్ని సాధించాడా? ఆ స‌మ‌యంలో ఏం తెలుసుకున్నాడన్న‌ది మిగ‌తా క‌థ‌.

ప‌వ‌న్ ఇమేజ్ తగ్గట్టకుగా త్రివిక్ర‌మ్ త‌న‌దైన శైలిలో ర‌చ‌న చేశారు. ప‌వ‌ర్ స్టార్ గ‌త సినిమాల మాదిరిగానే మేన‌రిజ‌మ్స్, గెటప్స్ ను స‌న్నివేశాల‌కి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేశారు. ఆ సీన్స్ వచ్చేటప్పుడు ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా చేశారు. డైలాగ్స్ పవన్ రాజ‌కీయ సిద్ధాంతాల‌కు అనుగుణంగా ఉన్నాయి. హీరోయిజాన్ని బాగా పండించడంలో సముద్రఖని విజయవంతమయ్యారు.


కుటుంబ స‌న్నివేశాలు మంచి డ్రామాను రక్తికట్టించాయి. మార్క్ పాత్ర‌ను ఆట‌ప‌ట్టిస్తూ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ చేసే హంగామా సినిమాలో జోష్ తెచ్చింది. జీవిత స‌త్యాన్ని తెలుపుతూనే మంచి వినోదాన్ని పంచారు. క్లైమాక్స్ స‌న్నివేశాలు సినిమాకు అదనపు బలంగా మారాయి. మార్క్ మ‌న‌సుని తేలిక ప‌రిచే సీన్స్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యాయి. ‘మ‌న జీవితం.. మ‌ర‌ణం భావిత‌రాల కోస‌మే’, ‘పుట్టుక మ‌లుపు .. మ‌ర‌ణం గెలుపు’ అంటూ ప‌వ‌ర్ స్టార్ చెప్పే డైలాగ్స్ ఆలోచ‌నను రేకెత్తిస్తాయి. ఫస్టాఫ్ లో వినోదం పండించారు. సెకండాఫ్ లో భావోద్వేగాలను బాగా చూపించారు.

ప‌వ‌న్‌ క‌ల్యాణ్, సాయిధ‌ర‌మ్ తేజ్‌ల మ‌ధ్య వచ్చే సీన్ బాగా పండాయి. ఇద్ద‌రి పాత్ర‌లు మెప్పించాయి. ప‌వ‌న్‌ ఫ్యాన్స్ ను మెప్పించే మేనరిజ‌మ్స్‌తో అద‌ర‌గొట్టాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్ర ఆకట్టుకునేలా ఉంది. సాయిధ‌ర‌మ్ తేజ్ లవర్ గా కేతిక శ‌ర్మ తెరపై కొంతసేపే మెరిసినా ఓ సాంగ్ లో త‌న గ్లామర్ తో ఆక‌ట్టుకుంది. మ‌రో హీరోయిన్ ప్రియా వారియ‌ర్ పాత్ర బాగుంది. త‌మ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు జీవం పోసింది. కెమెరా, ఎడిటింగ్‌, ఆర్ట్ విభాగాల ప‌నితీరు బాగుంది. మొత్తంగా పవన్‌ బ్రో ఎనర్జీతో మెప్పించాడు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×