BigTV English

Buchi Babu – NTR: ఎన్టీఆర్ కోసం క్యూలో ఉన్న మరో స్టార్ డైరెక్టర్… ఈసారైనా కరుణించేనా?

Buchi Babu – NTR: ఎన్టీఆర్ కోసం క్యూలో ఉన్న మరో స్టార్ డైరెక్టర్… ఈసారైనా కరుణించేనా?

Buchi Babu – NTR: టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ (NTR)ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా, గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవటమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే బాలీవుడ్ చిత్రం వార్ 2 (WAR 2)ద్వారా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.


వరుస ప్రాజెక్టులతో బిజీ..బిజీ..

ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయనకు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర 2 చేయబోతున్నారు. ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉందని, ఎన్టీఆర్ రావటమే ఆలస్యం అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఈయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో మరొక సినిమాకు కమిట్ అయ్యారని అదే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కూడా సినిమాకు కమిట్ అయ్యారని వార్తలు బయటకు వచ్చాయి.


ఎన్టీఆర్ తో పెద్ది చేయాల్సి ఉండేదా..

ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో ఎన్టీఆర్ కుమారస్వామి పాత్రలో కనిపించబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మరొక డైరెక్టర్ కూడా క్యూలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉప్పెన(Uppena) సినిమాతో ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి “పెద్ది” (Peddi)అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు తన తదుపరి ప్రాజెక్టు ఎన్టీఆర్ తో చేయాలని ఆలోచనలో ఉన్నారని, అందుకు తగ్గ కథ కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.

తారక్ అవకాశం ఇస్తారా..
నిజానికి ఇదివరకే బుచ్చిబాబు ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న పెద్ది సినిమా కథ ఎన్టీఆర్ కు వినిపించారని, ఈ సినిమా చేయటానికి మైత్రి వాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఈ ప్రకటన మాత్రం అధికారకంగా బయటకు రాలేదు. ఇలా అప్పుడు ఛాన్స్ ఇవ్వని తారక్ ఇప్పుడైనా బుచ్చి బాబుకు అవకాశం ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ తనకు అవకాశం ఇచ్చిన ప్రస్తుతం ఆయన కమిట్ అయిన అన్ని ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాతనే బుచ్చిబాబుతో సినిమా చేసే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×