BigTV English

SA ICC Trophy: 27 ఏళ్ళ సౌతాఫ్రికా గ్రహణం వీడింది..WTC ప్రైజ్ మనీ ఎంతంటే

SA ICC Trophy: 27 ఏళ్ళ సౌతాఫ్రికా గ్రహణం వీడింది..WTC ప్రైజ్ మనీ ఎంతంటే

SA ICC Trophy:  ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 విజేతగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఎవరు ఊహించని రీతిలో ఫైనల్ మ్యాచ్ ఆడిన దక్షిణాఫ్రికా… ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గెలిచి… 2025 ఛాంపియన్గా నిలిచింది. లండన్ లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పై ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది సౌత్ ఆఫ్రికా. ఈ నేపథ్యంలోనే 27 సంవత్సరాల తర్వాత తొలిసారి ఛాంపియన్ అయింది.


Also Read: WTC- Handling The Ball: WTC ఫైనల్‌లో అనూహ్య ఘటన..ఏంటి ఈ ‘హ్యాండిల్డ్ ది బాల్’ వివాదం ?

27 సంవత్సరాల తర్వాత చాంపియన్ అయిన సౌత్ ఆఫ్రికా


ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా దక్షిణాఫ్రికా నిలిచిన నేపథ్యంలో సరికొత్త రికార్డు నమోదు అయింది. 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ గెలిచింది దక్షిణాఫ్రికా. 1998 సంవత్సరంలో తొలి ఐసీసీ టైటిల్ ను సౌత్ ఆఫ్రికా గెలుచుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేకపోయింది దక్షిణాఫ్రికా. ఫైనల్ దాకా రావడం లేదా సెమీఫైనల్ లోనే… ఇంటికి వెళ్లడం జరిగింది. కానీ 27 సంవత్సరాల తర్వాత… బవుమా కెప్టెన్సీలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెల్చుకుంది దక్షిణాఫ్రికా.

సౌత్ ఆఫ్రికా దరిద్రం పోయింది గా!

1998 సంవత్సరంలో ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన సౌత్ ఆఫ్రికా… ఆ తర్వాత ఐసీసీ టోర్నమెంటులో దురదృష్టవశాత్తు రకరకాల కారణాల వల్ల వైదొలగాల్సి వచ్చింది. 2003 వరల్డ్ కప్ సమయంలో గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయింది దక్షిణాఫ్రికా. ఆ తర్వాత 2011 వరల్డ్ కప్… టోర్నమెంట్లో అద్భుతంగా రాణించింది దక్షిణాఫ్రికా. కానీ క్వార్టర్ ఫైనల్ దాకా వచ్చి… వరల్డ్ కప్ నుంచి దక్షిణాఫ్రికా ఎమినేట్ కావడం జరిగింది. ఇక 2015 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇదే పరిస్థితి. ఆ సమయంలో సెమీఫైనల్ దాకా వెళ్లి ఇంటి దారి పట్టింది. 2023 వరల్డ్ కప్ సమయంలో సెమీఫైనల్ దాకా వెళ్లి… ఫైనల్ చేరకుండానే ఇంటి దారి పట్టింది.

టి20 వరల్డ్ కప్ 2024 బ్యాడ్ లక్

టి20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్ గా ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ టి20 వరల్డ్ కప్ 2024 లో ఫైనల్ దాకా దక్షిణాఫ్రికా వచ్చింది. కానీ చివర్లో మాత్రం దారుణంగా విఫలమైంది ప్రోటీస్ జట్టు. ఆ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. దీంతో ఛాంపియన్ గా ఇండియా నిలువగా… దక్షిణాఫ్రికా మాత్రం ఇంటిదారి పట్టింది. ఇక మొన్న చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ సమయంలో సెమీఫైనల్ దాకా వెళ్లి ఇంటిదారి పట్టింది సౌత్ ఆఫ్రికా. ఇలా అన్ని ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్ దాకా లేదా సెమీఫైనల్ దాకా వెళ్లి దారుణంగా ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా. కానీ బవుమా కె ఫ్రెండ్స్ లో మాత్రం అద్భుతంగా రాణించి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది.

Also Read: Shubman Gill: సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న శుభ్‌మ‌న్ గిల్… ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకో అంటూ ట్రోలింగ్

WTC ప్రైజ్ మనీ ఎంత అంటే?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత సౌత్ ఆఫ్రికా కు భారీ రివార్డ్ అందింది. ఛాంపియన్గా నిలిచినందుకు 3.6 మిలియన్  అంటే 35 లక్షల రివార్డు దక్కింది. అదే సమయంలో రన్నరప్ గా ఉన్న.. ఆస్ట్రేలియాకు 2.1 మిలియన్ ప్రైజ్ మనీ రానుంది.

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×