టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న అంశం సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన. ఈ విషయం ఇప్పుడు రాజకీయ. రంగు పులుముకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే చట్టం దృష్టిలో అందరూ సమానులే అని, చట్టం ఎవరికి లోబడి ఉండదని ఇప్పటికే పోలీసులు కూడా వెల్లడించారు. ఇకపోతే సంధ్య థియేటర్ దగ్గర అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పటివరకు ఎక్కడ క్లారిటీ లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్(Allu Arjun)ఒక విషయం చెప్తుంటే.. పోలీసులు ఇంకొక విషయం చెబుతున్నారు..అసలు ఇందులో ఎవరు నిజం చెప్తున్నారు అనే విషయాలు అర్థం కాక ప్రజలలో గందరగోళం ఏర్పడుతోందని ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు
పబ్లిక్ పై కర్రలతో దాడి చేసిన బన్నీ బౌన్సర్లు…
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో సంధ్యా థియేటర్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించిన వీడియోలు రోజుకొకటి చొప్పున బయటకు వస్తున్నాయి. ఇక ఈ వీడియోలు చూస్తుంటే మాత్రం అసలు ఎవరు నిజం? ఏది నిజం? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సంధ్య థియేటర్ నుండి మరో సీసీటీవీ ఫుటేజ్ విడుదలయ్యింది. థియేటర్ ఎంట్రీ గేట్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్లు ఓవరాక్షన్ చేశారు. పబ్లిక్ థియేటర్ లోపలికి వెళ్లకుండా గేట్లు మూసివేశారు. అయినా సరే పబ్లిక్ లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా, బౌన్సర్లు పెద్దపెద్ద కర్రలతో పబ్లిక్ పై విచక్షణ రహితంగా దాడి చేయడం మనం చూడవచ్చు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ సైతం అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మీ బౌన్సర్లను అదుపులో పెట్టుకునే కనీస బాధ్యత మీదే కదా.. బౌన్సర్లు తప్పు చేసినా.. ఆ తప్పు మీదే అంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అల్లు అర్జున్ బౌన్సర్లలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకు కారణమైన ఆంటోనీ అనే బౌన్సర్ ను అరెస్టు చేశారు పోలీసులు.
మూడున్నర గంటల విచారణ..
మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ను ఈరోజు చిక్కడపల్లి పోలీసులు విచారించారు. దాదాపు మూడున్నర గంటలసేపు విచారణ జరపగా..18 ప్రశ్నలు వేశారట. అందులో 15 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిన అల్లు అర్జున్, మరో మూడు ప్రశ్నలకు చీకటిగా ఉంది కాబట్టి అసలు అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదంటూ చెప్పారట. ముఖ్యంగా విచారణకు మళ్లీ పిలిచినా.. తప్పకుండా హాజరవుతానని తెలియజేశారట అల్లు అర్జున్. ఏది ఏమైనా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా కలెక్షన్ల రికార్డులు ఒకవైపు సృష్టిస్తుంటే.. మరొకవైపు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సమస్య నుంచి అల్లు అర్జున్ ఎప్పుడు బయటపడతారో చూడాలి అంటూ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
సంధ్య థియేటర్ లో మరో సీసీటీవీ ఫుటేజ్ విడుదల
థియేటర్ ఎంట్రీ గేట్ వద్ద బౌన్సర్ల ఓవరాక్షన్
థియేటర్ లోపలికి వెళ్లకుండా గేట్లు మూసివేత
ఆపై పెద్ద కర్రలతో పబ్లిక్ పై బౌన్సర్ల దాడి pic.twitter.com/bVvvKo42bF
— BIG TV Breaking News (@bigtvtelugu) December 24, 2024