Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే తెరమీద పలువురు డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ చివరకు తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఫిక్స్ అయ్యాడు. ఇటీవలే వీరిద్దరి కాంబో మూవీ పూజాకార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హీరోయిన్ దీపికా పదుకొనే ఈ మూవీలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆమె లుక్ కు సంబందించిన ఫోటోలు కూడా బయటకు వచ్చేసాయి.. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్లోకి ఎంట్రీ పోతున్నారంటూ ఓ వార్త సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.. అట్లీ సినిమా తర్వాత ఓ హీరోతో సినిమా చేస్తున్నాడని టాక్..
మలయాళ దర్శకుడితో పుష్ప రాజ్ కొత్త సినిమా..
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి క్రేజ్ వచ్చింది. అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ అయ్యారు. ప్రస్తుతం మాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. స్టార్ హీరోయిన్లు సైతం అల్లు అర్జున్తో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ మాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. దానిపై తాజాగా ఒక క్లారిటీ వచ్చేసినట్లుంది. మాలీవుడ్ హీరో, డైరెక్టర్ బసిల్ జోసెఫ్ డబ్బింగ్ సినిమాల ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అయితే చాలా మందికి అతడు ఒక హీరోగా తెలుసు. ‘జయ జయ జయ జయహే’, ‘సూక్ష్మ దర్శిని’, ‘పొన్‌మాన్’ సినిమాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఓటీటీల్లో ఆకట్టుకున్నాయి..
హీరోగా పలు సినిమాలో నటించి సక్సెస్ అయిన ఈయన.. డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు మూడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన బసిల్ జోసెఫ్ కు తనతో సినిమా చేసే అవకాశం అల్లు అర్జున్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలలో బలంగా వినబడుతోంది. ఈ వీరిద్దరి కాంబో లో రాబోతున్న సినిమాని గీతాలు బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నారంటూ ఇండస్ట్రీలో టాక్.. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం..
Also Read : నటి కరిష్మా కపూర్ ఇంట విషాదం.. ఆమె మాజీ భర్త హఠాన్మరణం..
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తో నేషనల్ స్టార్ అయ్యారు. అయినా సినిమాలు అన్ని ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్నాయి.. రీసెంట్ గా గత ఏడాది పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ మూవీ తర్వాత డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అయ్యాక మలయాళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని సమాచారం.. ఈ సినిమాల తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తారేమో చూడాలి.