E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today June 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలకు షాక్‌ ఇచ్చిన ఆరు  

Nindu Noorella Saavasam Serial Today June 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలకు షాక్‌ ఇచ్చిన ఆరు  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  అందరూ హాల్లో కూర్చుని పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే ఇంతలో అమర్‌ చిత్ర తరపున పెళ్లికి ఎవరు వస్తారని అడుగుతాడు. దీంతో చిత్ర ఆశ్రమం వాళ్లు తప్ప తనకు ఎవ్వరూ లేరని చెప్తుంది. అయితే నిన్ను దత్తత తీసుకున్న వాళ్లు ఎక్కడున్నారు అని అమర్‌ అడగ్గానే.. అందరూ షాక్‌ అవుతారు.  ఇంతలో వినోద్‌ ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యా నువ్వూ అంటూ అడుగుతూ.. చిత్ర మా అన్నయ్య చెప్తుంది నిజమేనా అంటాడు. చిత్ర పలకదు. కిటికీలోంచి చూస్తున్న ఆరు చిత్రను దత్తత తీసుకున్నారా… ఇదెప్పుడు జరిగింది అని మనసులో అనుకుంటుంది. అడుగుతుంటే పలకవేంటి చిత్ర అని మిస్సమ్మ అడుగుతుంది. వాళ్లు వస్తున్నారు కదా చిత్ర. అంటే పెళ్లిలో నీ తల్లిదండ్రులు స్థానంలో కూర్చోవాల్సింది వాళ్లే కదా అంటాడు అమర్‌. దీంతో చిత్ర అవును బావగారు నేను ఫోన్‌ చేసి చెప్తాను అంటుంది. వినోద్‌ కోపంగా అంటే నీకు లీగల్‌ గా ఫేరెంట్స్‌ ఉన్నారా..? మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అంటూ నిలదీస్తాడు.

ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచావు అమ్మా అంటూ శివరాం అడుగుతాడు. ఎవరూ లేరన్నావు అనాథ అని చెప్పావు. మరి ఏంటమ్మా ఇదంతా మా దగ్గర నిజం ఎందుకు దాచావు అంటుంది నిర్మల. అడుగుతున్నది నిన్నే చిత్ర సమాధానం చెప్పు అంటూ వినోద్‌ కోపంగా అడుగుతాడు. ఇంతలో మనోహరి కల్పించుకుని వినోద్‌ చిత్రకు దత్తత విషయం మాట్లాడుకోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడు ఈ టాఫిక్‌ వచ్చిన ఎమోషనల్‌ అవుతుంది. అని చెప్పగానే.. చిత్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెనకే మనోహరి వెళ్తుంది. ఏం జరిగిందో నేను కనుక్కుంటాను అన్నయ్యా అంటూ వినోద్‌ వెళ్లిపోతాడు. కంగారుగా నిర్మల ఏంటండి ఏం జరిగిందో అర్థం కావడం లేదు అంటుంది. చిత్రకు ఆమెను దత్తత తీసుకున్న పేరెంట్స్‌ కు మధ్య ఏదో జరిగింది అంటాడు శివరాం. కిటికీ దగ్గర నుంచి అంతా వింటున్న ఆరు గార్డెన్‌లోకి చిత్ర గతం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో గుప్త వస్తాడు. ఏమి చేస్తున్నావు బాలిక అని అడుగుతాడు.

Advertisement

చిత్ర గతం తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను రావడం లేదు అంటుంది. దీంతో గుప్త వెటకారంగా కేవలం వీక్షించుట ఏలా మీ కుటుంబ సభ్యుల తలరాతలను నువ్వే స్వయంగా లికించుకొనుము.. ఇక మేము ఎందులకు.. ప్రభువుల వారు ఎందులకు చిత్రగుప్తుల వారు ఎందుకు అంటాడు. దీంతో ఆరు ఏంటి గుప్త గారు కామెడీ చేస్తున్నారా..? అంటుంది. దీంతో గుప్త కోపంగా మొదలు పెట్టినది ఎవరు అయినా నీకు వచ్చిన శక్తులతో విధిని మార్చాలనుకుంటే అరిష్టములు జరుగును అంటాడు. దీంతో ఆరు కోపంగా మీరు పక్కన ఉండగా నన్ను ఒక్క పని చేసుకోనివ్వరు అంటూ కొంచెం దూరంగా వెళ్లి మళ్లీ మంత్రాలు చదువుతుంది. ఇంతలో మిస్సమ్మ వస్తుంది.

అక్కా ఒక్క నిమిషం అంటూ పిలుస్తుంది. దీంతో ఆరు ఆయన దత్తత గురించి మాట్లాడగానే చిత్ర కళ్లలో కంగారును ముఖంలో భయాన్ని చూశాను భాగీ పైగా మను చిత్రను చాలా కవర్‌ చేసింది. అంటే చిత్ర కచ్చితంగా ఏదో దాచించి. ఆ దత్తత వెనక సీక్రెట్‌ తెలుసుకుంటే ఈ పెళ్లిని మనం ఆపొచ్చు అని చెప్తుంది. అయ్యో అంటూ మిస్సమ్మ లోపలికి వెళ్తుంది. ఆరు గుప్తతో కలిసి పిల్లల రూం దగ్గరకు వెళ్లి చూస్తుంది. పిల్లలు ర్యాపింగ్‌ చేసుకోవడానికి రాకపోవడంతో బాధడుతుంటారు. వెళ్లి మిస్సమ్మను అడుగుదామని అందరూ మిస్సమ్మ దగ్గరకు వెళ్తుంటే ఆరు వెళ్లి రాపింగ్‌ చేస్తుంది. ఆకాష్‌, అంజు చూసి మిస్సమ్మను తీసుకొస్తారు. రూంలో మిస్సమ్మను చూసిన ఆరు భయపడతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Advertisement

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×