Sara -Shubman Gill: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar) కూతురు సారా టెండూల్కర్ ( Sara Tendulkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సచిన్ టెండూల్కర్ కూతురుగా.. ప్రపంచానికి పరిచయమైన సారా టెండుల్కర్ ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ సినిమాలో కూడా ఇప్పటి వరకు నటించలేదు కానీ బాలీవుడ్ హీరోయిన్ కు ఉన్న రేంజ్ సారా టెండూల్కర్ కు మాత్రమే దక్కింది. అతి త్వరలోనే సారా టెండుల్కర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా వస్తుందని చెబుతున్నారు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది సారా టెండూల్కర్.
టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తో సారా టెండూల్కర్ డేటింగ్ ?
గత రెండు సంవత్సరాలుగా సారా టెండూల్కర్ అలాగే టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య ఏదో జరుగుతోందని… వాళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా… సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ చాలాసార్లు కెమెరాకు ఏకాంతంగా గడిపిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ముంబైలోనే వీళ్లిద్దరు తిరిగినట్లు అప్పట్లో ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. నిజంగానే సారా టెండూల్కర్ అలాగే శుభ్‌మన్ గిల్ మధ్య రిలేషన్ ఉందని… మరింత ప్రచారం చేశారు.
లండన్ కు ప్రయాణమైన సారా టెండూల్కర్ ?
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య త్వరలోనే ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్ వెళ్ళింది టీం ఇండియా. ప్రస్తుతం లండన్ లోనే ఉంటుంది టీమిండియా. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియా నుంచి… లండన్కు సారా టెండూల్కర్ వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జూన్ 20వ తేదీన మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ మ్యాచ్ కోసం ఇప్పటికే సారా టెండూల్కర్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట. శుభ్‌మన్ గిల్ ( Shubman Gill) బ్యాటింగ్ చూసేందుకే ఆమె వెళ్లినట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
Also Read: RCB For Sale: అమ్మేయడం ఫైనల్… ఆ లేడీ చేతికి RCB టీం.. ట్రబుల్ షూటర్ ప్లాన్ అదుర్స్ !
ఇంగ్లాండ్ వెళ్లిన టీం ఇండియా జట్టు ఇదే
టీం ఇండియా జట్టు: శుభమన్ గిల్ (c), రిషబ్ పంత్ (wk/vc), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (wk), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ థాకూర్, ప్రహమ్ద్ క్రిష్ణ ఠాకూర్, ప్రహమ్‌ద్ థాకూర్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.